
సమన్ గునన్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ గుహలో చిక్కుకున్న పిల్లలు, వారి కోచ్‌ను కాపాడేందుకు జరుగుతున్న సహాయక చర్యల్లో ఓ డైవర్ మృతిచెందాడు. గతంలో నావికా దళంలో పనిచేసిన 38 ఏళ్ల సమన్ గునన్ పిల్లలకు ఆహారం, ఆక్సిజన్ అందించి తిరిగి వస్తుండగా శ్వాస ఆడక మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రొఫెషనల్ డైవర్ చనిపోవడం ఈ ఆపరేషన్ సంక్లిష్టతను తెలియజేస్తోంది. ‘గుహలో చిక్కుకున్న వారికి ఆక్సిజన్ అందించేందుకు అతన్ని లోనికి పం పాం. కానీ దురదృష్టవశాత్తూ తిరిగొస్తూ శ్వాస ఆడక స్పృహ కోల్పోయాడు. ఎంత ప్రయత్నించినా అతన్ని కాపాడలేకపోయాం. అయినా పిల్లల్ని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతాయి’ అని నేవీ కమాండర్ తెలిపారు.