న్యూఢిల్లీ: కేన్సర్‌తో బాధపడుతున్న కేంద్ర మంత్రి జైట్లీ(66) అమెరికాలోని న్యూయార్క్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్నారని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించినట్లు వెల్లడించాయి. జైట్లీకి తొడ భాగంలో అరుదైన కేన్సర్ సోకింది. దీంతో ఆయన ఈ నెల 13న వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లారు. అమెరికాలో ఉన్నప్పటికీ ఆయన సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటూ వచ్చారు. గతేడాది మే 14న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో జైట్లీ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జైట్లీ బరువు తగ్గేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment