Mahesh Babu Under Rest In Dubai After Knee Surgery In Spain - Sakshi
Sakshi News home page

Mahesh Babu : మహేశ్‌బాబుకి సర్జరీ.. రెండు నెలల పాటు విశ్రాంతి!

Published Tue, Dec 14 2021 1:51 PM | Last Updated on Tue, Dec 14 2021 4:22 PM

Mahesh Babu Under Rest In Dubai After Knee Surgery In Spain - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబుకు సర్జరీ జరిగింది. కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ఆయన.. వైద్యుల సూచన మేరకు ఇటీవల స్పెయిన్‌కి వెళ్లి ఆపరేషన్‌ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన దుబాయిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు నెలల పాటు మహేశ్‌బాబు షూటింగ్‌కి దూరంగా ఉండనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్‌కు బ్రేక్‌ పడనుంది. ఆ కారణంగానే సినిమా విడుదల తేదిని కూడా వాయిదా వేశారు. మొదట జనవరి 14న సంక్రాంతి కానుకగా సర్కారు వారి పాట విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం, అనూహ్యంగా ఏప్రిల్ 1న వస్తున్నట్లు అధికారికంగా తెలియజేశారు. 



కాగా, మహేశ్‌బాబుకి గతంలో కూడా మోకాలి నొప్పితో  గాయంతో బాధపడ్డారు. 2014 నుంచి ఆయన ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. అయితే ఆ సమయంలో కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకొని మళ్లీ షూటింగ్‌కి వెళ్లారు. అప్పుడు సర్జరీ చేయించుకోకపోవడం వల్లే ఆ బాధ మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది. వైద్యుల సలహా మేరకే ఆయన స్పెయిన్‌ వెళ్లి సర్జరీ చేయించుకున్నారు. ఇక మహేశ్‌ సర్జరీ చేయించుకున్నారనే వార్త విన్న అభిమానులు.. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement