చర్ల: ఆపరేషన్ సమాధాన్‌ను వ్యతిరేకించాలంటూ మావోయిస్టులు ఇచ్చిన పిలుపుతో దండకారణ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌కు వ్యతిరేకంగా జనవరి 25 నుంచి 30 వరకు సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని, ఈ నెల 31న దేశవ్యాప్త బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యం లో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. 5, 6 రోజులుగా సరిహద్దు అటవీ ప్రాం తంలో భారీగా మోహరించిన ప్రత్యేక పోలీసు బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, మిలిటెంట్లు, మిలీషియా సభ్యుల కోసం పోలీసు బలగాలు జల్లెడ పడుతుండటంతో సరిహద్దు ప్రాంతం రణరంగంగా మారింది. ఏ క్షణంలో ఏం ప్రమాదం ముం చుకొస్తుందోనని ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల గిరిజనులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.
దండకారణ్యలో మోహరించిన సీఆర్‌పీఎఫ్, స్పెషల్‌పార్టీ, కోబ్రా బలగాలు సరిహద్దుల్లో అనుమానితులుగా కనిపించే వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ వారి నుంచి మావోయిస్టుల సమాచారం రాబట్టే ప్రయత్నాలు చేసు ్తన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులు సభలు ఎక్కడ పెడుతున్నారు.. ఎవరైనా వెళ్తున్నారా? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment