
మెగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు సర్జరీ పూర్తయింది. ఈ మేరకు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కాగా శుక్రవారం సాయంత్రం ఆయన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయికి వైద్యులు కాలర్ బోన్‌కు సర్జరీ నిర్వహించారు. కాసేపటి క్రితమే ఈ ఆపరేషన్ సెక్సెస్‌గా ముగిసిందని వైద్యులు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సాయి తేజ్ బావ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన, అల్లు అరవింద్‌లు ఉదయం ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడి వెళ్లారు. కాగా ఈ ప్రమాదంలో సాయి తేజ్ కాలర్ బోన్ ఫ్యాక్చర్ కాగా ఛాతి భాగంలో గాయమైన సంగతి తెలిసిందే.

Comments
Please login to add a commentAdd a comment