
కొంతమంది హీరో,హీరోయిన్లు చేసింది తక్కువ సినిమాలే అయినా ఇట్టే గుర్తిండిపోతారు. అలాంటి వారిలో నటి కనిహ ఒకరు. శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఒట్టేసి చెబుతున్నా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కనిహా తన అందం, అభినయంతో తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. ఆమె అసలు పేరు దివ్య వెంకట సుబ్రమణ్యం. తమిళనాడుకు చెందిన ఆమె ఇండస్ట్రీలోకి వచ్చాక తన పేరును కనిహా అని మార్చుకుంది.
తెలుగులో ఒట్టేసి చెపుతున్నా,నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ వంటి సినిమాల్లో నటించింది. 2008లో పెళ్లి చేసుకొని సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం మలయాళ చిత్రాల్లో నటిస్తున్న ఆమె సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. తాజాగా కనిహా గాయపడింది.
ఫ్రాక్చర్ కారణంగా నడలేని స్థితిలో ఉంది. వాకర్ పట్టుకొని ఉన్న ఓ ఫోటోను షేర్ చేస్తూ.. బ్యాలెన్సింగ్‌గా అడుగులు వేయడం నేర్చకుంటున్నా అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన పలువురు సినీ ప్రముఖులు సహా నెటిజన్లు కనిహా త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment