![Trisha Suffers Severe Injury Following Foreign Vacation See Photo - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/6/trisha.jpg.webp?itok=L6tairSr)
స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. 40కి చేరువవుతున్నా ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా సత్తాచాటుతుంది. ఇటీవలె లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో కుందవై పాత్రలో నటించి ఆకట్టుకుంది.
ఈ సినిమా హిట్‌తో త్రిషకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో త్రిష ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇటీవలె విదేశాలకు వెళ్లిన త్రిష గాయంతో తిరిగొచ్చింది. టూర్‌లో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఆమె కాలు విరిగింది.
ఈ క్రమంలో కాలికి పట్టి వేసి ఉన్న ఫోటోని త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేసింది. ప్రమాదం కారణంగా వెకేషన్ మధ్యలోనే రావాల్సి వచ్చిందని పేర్కొంది. ఇక త్రిష షేర్ చేసిన ఫోటో చూసి ఆమె త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కోరుకుంటున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment