
Trisha Wearing Shoes Near Sami Idols During The Shooting of Ponniyin Selvan: నటి త్రిష, దర్శకుడు మణిరత్నంను అరెస్టు చేయాలని కోరుతూ హిందూ సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్ సెల్వన్. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఇండోర్‌లో జరుగుతోంది.
కాగా శుక్రవారం త్రిష కారు దిగి చెప్పులతో శివుడు, నంది విగ్రహాల మధ్య నడుచుకుంటూ వచ్చిన సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే హిందువులు పవిత్రంగా భావించే దేవుళ్ల విగ్రళ్లు ఉన్న ప్రాంతానికి త్రిష పాదరక్షలు ధరించి రావడాన్ని హిందూ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. త్రిష, దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదు చేయాలని హరికేష్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
చదవండి : డ్రగ్స్ కేసు : నటుడు అర్మాన్ కోహ్లీకి షాక్ ఇచ్చిన కోర్టు
‘‘అంత్యక్రియలకు కూడా అందంగా తయారవ్వాలా?’’