సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాలికి ఫ్రాక్చర్ అయినందు వల్ల మూడు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచించారని ఆమె తెలిపారు. అందుకే కొన్నిరోజులపాటు ఇంటికే పరిమితం కానున్నట్లు చెప్పారు.
అయితే తన కార్యాలయం మాత్రం అందుబాటులో ఉంటుందని, ఎలాంటి సమాచారానికైనా, సాయానికైనా తన ఆఫీస్‌ను సంప్రదించవచ్చని కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
Due to Avulsion fracture, I have been advised bed rest for 3 weeks.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 11, 2023
My @OfficeOfKavitha shall be available for any assistance or communication.
అయితే ఎలా గాయపడ్డారనే విషయాన్ని మాత్రం కవిత వెల్లడించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇటీవలే ఈడీ ఎదుట ఆమె విచారణకు హాజరయ్యారు. మొత్తం మూడు రోజుల పాటు ఆమెపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను కూడా కవిత అధికారులకు అప్పగించారు. తాను ఏ తప్పు చేయలేదని, అవసరమైతే న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధమని ఆమె ప్రకటించారు.
చదవండి: ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తోంది.. మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment