Bed Rest
-
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. మూడు వారాలు విశ్రాంతి..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాలికి ఫ్రాక్చర్ అయినందు వల్ల మూడు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచించారని ఆమె తెలిపారు. అందుకే కొన్నిరోజులపాటు ఇంటికే పరిమితం కానున్నట్లు చెప్పారు. అయితే తన కార్యాలయం మాత్రం అందుబాటులో ఉంటుందని, ఎలాంటి సమాచారానికైనా, సాయానికైనా తన ఆఫీస్‌ను సంప్రదించవచ్చని కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. Due to Avulsion fracture, I have been advised bed rest for 3 weeks. My @OfficeOfKavitha shall be available for any assistance or communication. — Kavitha Kalvakuntla (@RaoKavitha) April 11, 2023 అయితే ఎలా గాయపడ్డారనే విషయాన్ని మాత్రం కవిత వెల్లడించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇటీవలే ఈడీ ఎదుట ఆమె విచారణకు హాజరయ్యారు. మొత్తం మూడు రోజుల పాటు ఆమెపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను కూడా కవిత అధికారులకు అప్పగించారు. తాను ఏ తప్పు చేయలేదని, అవసరమైతే న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధమని ఆమె ప్రకటించారు. చదవండి: ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తోంది.. మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ -
అబ్బే..పెద్ద గాయమేం కాదు!
‘‘అయ్యో ఆమిర్‌ఖాన్‌కు దెబ్బ తగిలిందా... బెడ్ రెస్ట్ తీసుకోవాలా? అసలు ఆమిర్ ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎన్ని రోజులు విశ్రాంతిలో ఉండాలి?’’ అని ఆమిర్ ఖాన్ అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన పడిపోయారు. ప్రస్తుతం ఆమిర్ ‘దంగల్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన మల్లయోధుడిగా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆమిర్ బరువు కూడా పెరిగారు. కాగా, లూధియానాలో మల్లయుద్ధానికి సంబంధించిన సీన్ తీస్తున్నప్పుడు ఆమిర్ భుజానికి గాయం అయ్యిందనే వార్త వచ్చింది. ఈ వార్త విని, ఆయన అభిమానులు కంగారుపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమిర్ గ్రహించకుండా ఉంటారా? ‘‘నాకు తగిలినది పెద్ద గాయమేం కాదు. కండరం పట్టేసింది. అంతే. వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే చాలు. ఆ తర్వాత షూటింగ్లో పాల్గొంటాను’’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారాయన. దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి, ఆదివారం తీవ్రమైన నొప్పితో ఆమిర్ లూధియానా ఆస్పత్రిలో చేరారు. డాక్టర్లు పరిశీలించి, వారం రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే, అదే రోజు ప్రయాణం చేయకూడదని చెప్పడంతో ఆదివారమంతా ఆమిర్ లూధియానాలోనే ఉన్నారు. సోమవారం ముంబయ్ ప్రయాణమయ్యారు. -
70 రోజులు.. 11 లక్షలు!
బెడ్ రెస్ట్ తీసుకుంటే చాలు దరఖాస్తులు ఆహ్వానించిన నాసా కష్టపడి పని చేస్తేనే కానీ డబ్బులు రాని ఈ రోజుల్లో నిద్రపోతే కూడా డబ్బులొస్తాయా? అవును! ప్రయోగశాలకు వచ్చి మంచంపై పడుకుంటే చాలు.. రోజుకు రూ. 10 వేల చొప్పున డబ్బులిచ్చేస్తామంటున్నారు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు! 70 రోజుల పాటు మంచంపై పడుకుంటే సరి.. రూ.11 లక్షలకు పైనే ముట్టజెపుతామని వారు ప్రకటించారు. ఇంతకూ డబ్బెందుకిస్తారు? ఈ వింత ప్రయోగాలేమిటి? ఎందుకు? అంటే... భూమి మీద రోదసి ఎఫెక్ట్ అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేమి వల్ల దీర్ఘకాలంలో వ్యోమగాముల ఆరోగ్యంపై దుష్ర్పభావాలు పడతాయి. కండరాలు, ఎముకలు కరిగిపోతాయి. గుండె పనితీరు మందగిస్తుంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారాల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు ప్రయోగాలు చేస్తున్నారు కూడా. అయితే, అన్ని పరీక్షలూ అంతరిక్షంలోనే చేయాలంటే కష్టం కాబట్టి.. ఇలా భూమ్మీదే రోదసి పరీక్షలకు రంగం సిద్ధం చేశారు. గురుత్వాకర్షణ లేమి ఎఫెక్ట్ కోసమని.. ఎల్లప్పుడూ తలను వెనక్కి వాల్చి.. కాళ్లు కొంచెం ఎత్తుగా చాపుకుని వెల్లకిలా పడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని రోజులూ మంచం మీదే! పరీక్షలకు ఎంపికైతే.. తల కిందికి వాల్చి, కాళ్లు పైకి ఉంచి వెల్లకిలా పడుకోవడం, చిన్నచిన్న పనులు చేసుకోవడంలో రెండు వారాలు శిక్షణ ఇస్తారు. తర్వాత పది వారాలు పూర్తిగా మంచంపై పడుకునే గడపాల్సి ఉంటుంది. ఈ సమయంలో పైకి లేచేదే ఉండదు. ఒకటీ, రెండూ అన్నీ మంచంపైనే! షవర్ హెడ్‌తో స్నానం చేయాలి. అప్పుడప్పుడూ చిన్నచిన్న కసరత్తులూ చేయాలి. ఇలా 70 రోజుల పాటు పడుకుని ఉంటే.. మెడ, దేహం, కండరాలు, ఎముకల్లో కలిగే మార్పులు, నొప్పి, గుండె ఆరోగ్యం వంటివి నిరంతరం పర్యవేక్షిస్తారు. పరీక్షలు అయిపోయాక 14 రోజుల్లో కోలుకుని ఇంటికి వెళ్లిపోవచ్చు. కొంచెం కష్టమే కానీ.. ఇంత డబ్బు ఇస్తామంటే మేం రెడీ! అంటారా? కానీ కుదరదు లెండి. ఎందుకంటే ఈ పడక చాన్స్ అమెరికా పౌరులకు మాత్రమే!