ఆ ఫ్రాక్చర్‌ని ఏఐ పసిగట్టింది..కానీ డాక్టర్లు.. | Mother Claims Elon Musk's AI Detected Daughter's Fracture That Doctors Missed | Sakshi
Sakshi News home page

ఆ ఫ్రాక్చర్‌ని ఏఐ పసిగట్టింది..కానీ డాక్టర్లు..

Published Sun, Jan 12 2025 1:29 PM | Last Updated on Sun, Jan 12 2025 4:01 PM

Mother Claims Elon Musk's AI Detected Daughter's Fracture That Doctors Missed

ఆర్టిఫిషయల్‌ ఇంటిలిజెన్స్‌ అంటేనే అమ్మో అని హడలిపోతున్నారు జనాలు. దీని వల్ల ‍ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువని చాలమంది విశ్లేషకులు, నిపుణుల అభిప్రాయం. చెప్పాలంటే దీన్ని వ్యతిరేకించేవారి సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా నిరుద్యోగం ఎక్కువవతుందనేది అందరి ఆందోళన. అయితే దీన్ని సరిగా ఉపయోగించుకుంటే మన ఎదుగదలకు దోహదపడుతుందనే ఓ సరికొత్త అంశం వెలుగులోకి వచ్చింది. సవ్యంగా ఉపయోగిస్తే నష్టాన్ని కూడా లాభంగా మార్చుకోవచ్చు. ఏదైనా మనం ఉపయోగించే విధానంలో ఉంటుందన్నా.. పెద్దల నానుడిని గుర్తు చేసేలా ఓ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన ఓ రకంగా ఏఐపై ఉన్న నెగిటివిటీకి స్వస్తి చెప్పేలా జరిగింది. ఏం జరిగిందంటే..

ఓ తల్లి సోషల్‌ మీడియాలో తన ఏఐ అనుభవాన్ని నెటిజన్లతో షేర్‌ చేసుకుంది. ఈ పోస్ట్‌ నెట్టింట సంచలనంగా మారి చర్చలకు దారితీసింది. ఆమె తన కుమార్తె కారు ప్రమాదంలో చిక్కుకుందని. ఆ సమయంలో ఎలాంటి గాయాలు అవ్వకపోయినా ఆమె మణికట్టు నుంచి మోచేయి భాగం వరకు విపరీతమైన నొప్పిని ఎదుర్కొంది. 

వైద్యులు వద్దకు తీసుకెళ్తే..ఎముకలు ఫ్రాక్చర్‌ కాలేదని చెప్పి ఇంటికి పంపించేశారు. కానీ ఆమె నొప్పితోనే విలవిలలాడుతూ ఉండేది. దీంతో అనుమానంతో ఎలాన్‌ మస్క్‌(Elon Musk ఫ్లాట్‌ఫామ్‌  ఏఐ చాట్‌బాట్‌(AI chatbot) గ్రోక్‌(Grok)లో తన సందేహం నివృత్తి చేసుకునే యత్నం చేసింది. అందుకోసం తన కుమార్తె ఎక్స్‌ రేని అప్‌లోడ్‌ చేసి ఫ్రాక్చర్‌(fracture) అయ్యిందో కాలేదా అని ప్రశ్నించింది. 

అయితే గ్రోక్‌ డిస్టల్ రేడియస్‌లో స్పష్టమైన ఫ్రాక్చర్ లైన్ ఉందని పేర్కొంది. అయితే ఇదే ఈసందేహం ఆ తల్లికి ముందే తట్టింది.  అయితే అప్పుడు ఆ వైద్య బృందాన్ని అడిగితే..అది గ్రోత్ ప్లేట్ అని చెప్పి భయపడాల్సిన పనిలేదని ఆ తల్లికి నమ్మకంగా చెప్ప్పారు. కానీ ఇక్కడ ఏఐ ఆ తల్లి అనుమానమే నిజమని తేల్చింది. 

దీంతో ఆమె మరో చేతి ఎముకల స్పెషలిస్ట్‌ని కలవగా డోర్సల్ డిస్‌ప్లేస్‌మెంట్‌తో డిస్టల్ రేడియల్ హెడ్ ఫ్రాక్చర్ ఉందని, తక్షణమే సర్జరీ  చేయాలని చెప్పడం జరిగిందని పోస్ట్‌లో రాసుకొచ్చింది. త్రుటిలో తన కూతురు ఆ నొప్పి నుంచి బయటపడగలిగింది లేదంటే చేతిని కోల్పోయే ప్రమాదం ఏర్పడేదని చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు ఏఐ మానవుడిని మించిపోయిందని ఒకరు, ఆరోగ్య సంరక్షణ వంటి వాటి విషయాల్లో దీన్ని ఎంతవరకు నమ్మగలం అని మరోకరూ అనుమానం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: 'ఏది వడ్డించినా సంతోషంగా తింటా': మోదీ)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement