చివరి టెస్టుకు శిఖర్ ధావన్ దూరం | Karun Nair replaces injured Shikhar Dhawan for third Test against New Zealand | Sakshi
Sakshi News home page

చివరి టెస్టుకు శిఖర్ ధావన్ దూరం

Published Tue, Oct 4 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

చివరి టెస్టుకు శిఖర్ ధావన్ దూరం

చివరి టెస్టుకు శిఖర్ ధావన్ దూరం

కోల్‌కతా: ఎడమ చేతి వేలి గాయంతో శిఖర్ ధావన్ న్యూజిలాండ్‌తో జరిగే మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఆదివారం బౌల్ట్ బౌలింగ్‌లో రెండు సార్లు అతనికి గాయమైన సంగతి తెలిసిందే. ఎక్స్‌రే తీసిన అనంతరం వేలికి ఫ్రాక్చర్ అరుునట్లుగా తేలింది. దాంతో అతనికి కనీసం రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇండోర్‌లో జరిగే మూడో టెస్టులో ఓపెనర్‌గా గౌతమ్ గంభీర్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు మెరుగయ్యాయి.

మరోవైపు ధావన్ స్థానంలో ముందు జాగ్రత్తగా కర్ణాటక బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇటీవలి జింబాబ్వే పర్యటనలో రెండు వన్డేలు ఆడిన నాయర్... గత ఏడాది శ్రీలంక పర్యటనలోనూ టెస్టు జట్టుకు ఎంపికై నా, మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement