మేని మెరుపులకు... డెర్మటాలజిస్టు | opportunities with Dermatology Courses | Sakshi
Sakshi News home page

మేని మెరుపులకు... డెర్మటాలజిస్టు

Published Sat, Jul 5 2014 12:22 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

మేని మెరుపులకు... డెర్మటాలజిస్టు - Sakshi

మేని మెరుపులకు... డెర్మటాలజిస్టు

 మనిషి చర్మానికి 3 వేలకుపైగా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. సొరియాసిస్, స్కిన్ క్యాన్సర్, ఇన్ఫెక్షన్లు వంటివాటితో చర్మం జీవం కోల్పోతుంది. అందవిహీనంగా మారుతుంది. డెర్మటాలజిస్టులు వీటిని గుర్తించి, తగిన చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇప్పుడు డెర్మటాలిజిస్టులను ఆశ్రయించేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది.
 
డెర్మటాలజీని కెరీర్‌గా ఎంచుకుంటే ఎన్నో వెసులుబాట్లు ఉన్నాయి. ప్రధానమైంది.. అనుకూలమైన పనివేళలు. ఇతర వైద్యుల్లాగా ఎమర్జెన్సీ కేసులను చూడాల్సిన సందర్భాలు చాలా స్వల్పంగా ఉంటాయి. ఎల్లవేళలా రోగులకు అందుబాటులో ఉండాల్సిన అవసరం కూడా లేదు. నచ్చిన సమయాల్లో పనిచేసుకోవచ్చు. చికిత్స ద్వారా రోగులకు స్వస్థత చేకూరిస్తే కెరీర్‌గా పరంగా ఎదురే ఉండదు.
 
 డెర్మటాలజిస్టులకే అగ్రస్థానం

 భారత్‌లో నిపుణులైన డెర్మటాలజిస్టుల కొరత అధికంగా ఉంది. అనుభవం కలిగిన చర్మ వైద్యులకు భారీ డిమాండ్ ఉంది. డెర్మటాలజిస్టులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి అవకాశాలున్నాయి. విదేశాల్లోనూ వీరికి భారీ వేతన ప్యాకేజీ లభిస్తోంది. సొంతంగా క్లినిక్‌ను స్థాపించుకుంటే మంచి ఆదాయం ఆర్జించొచ్చు. దేశంలో ప్రధాన నగరాలతోపాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ కార్పొరేట్ ఆసుపత్రులు ఏర్పాటవుతున్నాయి. వీటిలో డెర్మటాలజిస్టులను తప్పనిసరిగా నియమిస్తున్నారు. ఈ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశించింది. కాస్మటిక్ డెర్మటాలజీ, లేజర్ ట్రీట్‌మెంట్ వంటి వాటి ద్వారా చికిత్సలు మరింత సులువుగా మారాయి. వేతనాల పరంగా ఫిజిషియన్లలో డెర్మటాలజిస్టులకు అగ్రస్థానం దక్కుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.
 
 అర్హతలు: బయాలజీ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైన తర్వాత ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి ఎంబీబీఎస్(అండర్‌గ్రాడ్యుయేట్) డిగ్రీ పూర్తిచేయాలి. తర్వాత డెర్మటాలజీలో ఎండీ(పోస్టుగ్రాడ్యుయేట్)  చదవాలి. అనంతరం ఇంటర్న్‌షిప్, రెసిడెన్సీ పూర్తిచేసి, డెర్మటాలజిస్టుగా కెరీర్ లో స్థిరపడొచ్చు.
 
 వేతనాలు: డెర్మటాలజిస్టులకు ప్రారంభంలో నెలకు రూ.40 వేల నుంచి వేతనం ప్రారంభమవుతుంది. తర్వాత అనుభవాన్ని బట్టి నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.
 
 కూల్‌గా సాగిపోయే కెరీర్..
 ‘‘చర్మ సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెరిగింది. దాంతో డెర్మటాలజిస్టులకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. మారుతున్న టెక్నాలజీతో వైద్యవిధానాల్లో అనేక మార్పులు వచ్చాయి.  వయసు మీదపడుతున్నపుడు ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు యాంటీ ఏజింగ్ ప్రక్రియ ప్రాచుర్యంలోకి వచ్చింది. అర్ధరాత్రి, అపరాత్రిళ్లు అత్యవసర కేసులు వచ్చే అవకాశం లేదు. అందుకే అధికశాతం మహిళా వైద్యులు డెర్మటాలజీని ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీని అప్‌డేట్ చేసుకోగలిగితే ఆదాయమార్గం భారీ ఎత్తున పెరిగినట్లే. డెర్మటాలజీని స్పెషలైజేషన్‌గా తీసుకున్నవారికి ప్రస్తుతం పుష్కలమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి’’
 -డాక్టర్ మన్మోహన్, డెర్మటాలజీ విభాగ అధిపతి,
  ఉస్మానియా జనరల్ ఆసుపత్రి
 
 డెర్మటాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
  మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ-న్యూఢిల్లీ
 వెబ్‌సైట్: ఠీఠీఠీ.ఝ్చఝఛి.్చఛి.జీ
 ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)-న్యూఢిల్లీ
 వెబ్‌సైట్: www.aiims.edu
  లేడీ  హార్డింగ్ మెడికల్ కాలేజీ-న్యూఢిల్లీ
 వెబ్‌సైట్: http://www.hardinge.org/
  గురు తేజ్ బహదూర్ హాస్పిటల్-న్యూఢిల్లీ
 వెబ్‌సైట్: www.gtbh.delhigovt.nic.in
 
 జాబ్స్, అడ్మిషన్స్ అలర్‌‌ట్స

 ఏపీ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్
 పోస్టు: అసిస్టెంట్ ఇంజనీర్; విభాగం: ఎలక్ట్రికల్
 అర్హతలు: ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్/ఏఎంఐఈ ఉండాలి.
 వయసు: 36 ఏళ్లకు మించకూడదు.; ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 26;
 వెబ్‌సైట్: www.apeasternpower.com
 
 నవోదయ విద్యాలయ సమితి
 పోస్టు: ప్రిన్సిపాల్; ఖాళీల సంఖ్య: 47
 అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా మాస్టర్స్ డిగ్రీ, బీఎడ్ ఉండాలి. రెసిడెన్షియల్/సీబీఎస్‌ఈ/రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పీజీటీ/మాస్టర్/లెక్చరర్‌గా కనీసం పన్నెండేళ్ల అనుభవం ఉండాలి.; ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 31
 వెబ్‌సైట్: http://www.navodaya.nic.in/
 
 భారత నావికాదళం
 పోస్టులు: యూనివర్సల్ ఎంట్రీ స్కీమ్-ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్స్
 అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.; ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా..
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 5
 వెబ్‌సైట్: http://nausena-bharti.nic.in/
 
 పారాదీప్ పోర్ట్ ట్రస్టు
 పోస్టులు: డిప్యూటీ  చీఫ్ మెడికల్ ఆఫీసర్(స్పెషలిస్ట్)
 అర్హతలు: ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో ఎండీ/డీఎన్‌బీ/ఎంఎస్ ఉండాలి. కనీసం ఏడేళ్ల క్లినికల్ అనుభవం అవసరం
 ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా; దరఖాస్తులకు చివరి తేది: జూలై 28
 వెబ్‌సైట్: http://www.paradipport.gov.in/
 
 నిమ్స్- హైదరాబాద్
 కోర్సులు:  బీఎస్సీ(నర్సింగ్)  బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ
  మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్
 నోటిఫికేషన్‌లో నిర్దేశించిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.
 ఎంపిక: రాత పరీక్ష, వైవా ద్వారా..
 దరఖాస్తులకు చివరి తేది: జూలై 16
 వెబ్‌సైట్: http://www.nims.edu.in/
 
 సీమ్యాట్
 కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్)-2015-16(మొదటి పరీక్ష) నోటిఫికేషన్‌ను ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది.
అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ(10+2+3) ఉత్తీర్ణులు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 25
వెబ్‌సైట్: http://www.aicte-cmat.in/

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement