soriyasis
-
షిఫ్ట్ డ్యూటీల్లో పనిచేస్తుంటే సమస్యలు..!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 38. నేను గత పదేళ్లుగా సొరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా తాత్కాలిక ఉపశమనమే తప్ప నయడం కావడం లేదు. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉంటే చెప్పగలరు. -బి.సురేశ్, హైదరాబాద్ సొరియాసిస్ అనేది దీర్ఘకాలిక సమస్య. ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ల మంది సొరియాసిస్‌తో బాధపడుతున్నారని అంచనా. సాధారణంగా చాలా మంది సొరియాసిస్‌ను ఒక సాధారణ చర్మరోగంగానే భావిస్తారు. ఇది ఆటోఇమ్యూన్ వ్యాధి. శరీరంలోని చర్మకణాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు ఆ కణాలపై అనేక పొరలు ఏర్పడతాయి. తద్వారా చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్లు ఏర్పడటం వంటివి మొదలవుతాయి. ఇలా చర్మంపై దద్దుర్లు ఏర్పడే రుగ్మతనే సొరియాసిస్ అంటారు. ఈ వ్యాధి ఏ వయసు వారికైనా రావచ్చు. కొందరిలో చర్మంపై దురదతో కూడిన వెండిరంగు పొలుసులు కూడా కనిపిస్తాయి. ఇది ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరిచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సొరియాసిస్ ఉన్న 15 శాతం మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే సొరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. లక్షణాలు: చర్మం ఎర్రబడటం, తీవ్రమైన దురద, జుట్టు రాలిపోవడం, కీళ్లనొప్పులు, చర్మం పొడిబారినప్పుడు చర్మంపై పగుళ్లు ఏర్పడడంతోబాటు రక్తస్రావం అవుతుంది. కారణాలు: వంశపారంపర్యం, మానసిక ఒత్తిడి, ఆందోళన, శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో అసమతుల్యతల వల్ల, కొన్ని రకాల మందులు దీర్ఘకాలికంగా వాడటం వల్ల. రకాలు: దీనిని ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి సొరియాసిస్ వల్గారిస్, గట్టేట్ సొరియాసిస్ (గట్టా అంటే బిందువు) పుష్టులార్ (పస్ అంటే చీము) ఎరిత్రోడెర్మల్ (ఎరిత్రో అంటే ఎరుపు) నిర్థారణ: స్కిన్ బయాప్సీ, ఈఎస్సార్, సీబీపీ, ఎక్స్‌రే. హోమియో చికిత్స: సొరియాసిస్ నివారణకు హోమియోపతి ఎంతగానో సహాయపడుతుంది. ఈ వ్యాధిని వెంటనే గుర్తించి, తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం. సాధారణంగా ఈ వ్యాధికి సల్ఫర్, ఆర్సెనిక్ ఆల్బం, కాలి ఆర్బ్, సొరినమ్, మెజీరియం, పిట్రోలియం వంటి మందులను వాడవచ్చు. స్టార్ హోమియోపతిలో రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని జెనిటిక్ కాన్స్టిట్యూషనల్ విధానంలో చికిత్స చేస్తారు. మీరు అనుభవజ్ఞులైన హోమియో వైద్యుని కలవడం ఉత్తమం. కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 45. నాకు తరచూ ఛాతీలో మంట వస్తుంటుంది. ప్రతిసారీ ఇది గ్యాస్ నొప్పే కదా అని అనుకుంటూ ఉంటాను. నాకు గుండెనొప్పి వచ్చినప్పుడు కూడా ఇలాగే తేలిగ్గా తీసుకుంటానేమోనని సందేహం వస్తోంది. గుండెనొప్పికీ, గ్యాస్‌తో వచ్చే ఛాతీనొప్పికి తేడాలు చెప్పండి. - డి. మనోహర్‌రావు, నకరెకల్లు సాధారణంగా చాలామంది గుండెపోటును గ్యాస్ సమస్యగానో, కడుపులో/ఛాతీలో మంటగానో, వెన్నునొప్పిగానో, మెడనొప్పిగానో తేలిగ్గా తీసుకుంటుంటారు. వాస్తవానికి మీరు అజీర్తి లేదా గ్యాస్ సంబంధిత సమస్యతో బాధపడుతూ... కడుపులోనో లేదా గుండెలోనో మంటగా ఉంటే... ఒక్క యాంటాసిడ్ మాత్రతో తగ్గిపోతాయి. మెడ, వెన్ను లేదా ఆ పరిసరాల్లోని ఇతర ప్రాంతాల్లో నొప్పి ఉంటే పెయిన్‌కిల్లర్ మాత్ర తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఇలా జరిగితే పరవాలేదు. కానీ ఇలా ఒకటి రెండు టాబ్లెట్లు తీసుకున్న తర్వాత కూడా ఉపశమనంగా లేదని మీరు భావిస్తే మాత్రం దాన్ని కచ్చితంగా గుండెనొప్పిగా అనుమానించాల్సిందే. గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీ మధ్యలో నొప్పితో పాటు తీవ్రమైన అసౌకర్యం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఛాతీ మెలిపెడుతున్నట్లుగానూ, ఛాతీపైన బరువు పెట్టినట్లుగా, ఒత్తిడి పడ్డట్లుగా ఉంటుంది. నొప్పి ఎక్కడినుంచి వస్తోందో బాధితులు గుర్తించలేరు. ఛాతీమొత్తం వ్యాపించినట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పి చాలాసార్లు కండరాలకు సంబంధించిన నొప్పిలా, జీర్ణసంబంధ నొప్పి కూడా ఇలాగే అనిపిస్తూ తికమకపెడుతుంటుంది. రెండింటికీ తేడా ఏమిటంటే... గుండెనొప్పి ఒకసారి వస్తే అది కొనసాగుతూ ఉంటుంది. అందే కండరాలు లేదా జీర్ణకోశ నొప్పులైతే వస్తూపోతూ ఉంటాయి. అందువల్ల గుండెపోటును గ్యాస్ సమస్యగా తికమకపడకుండా దాని లక్షణాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక్కోసారి నొప్పి ఛాతీలో కాకుండా చంకల నుంచి మెడ, దవడలు, పొట్ట, దంతాల నుంచి కూడా మొదలుకావచ్చు. అసిడిటీ సమస్యలుండే వారిలో ఛాతీలో మంటగా కూడా ఉంటుంది. మనకు వచ్చే నొప్పి అసిడిటీ పెరగడం వల్ల వచ్చిన నొప్పి కాదని తేలితే... అది తప్పక గుండెనొప్పేనని అనుమానించాలి. స్లీప్ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ ఇలా షిఫ్టుల్లో పనిచేస్తున్నాను. ఇటీవల నాలో చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోంది. దాంతో పాటు ఏ అంశంపైనా దృష్టి నిలపలేకపోతున్నాను. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వగలరు. - సమీర్, హైదరాబాద్ మీలా పగలూ, రాత్రీ పనిచేసేవాళ్లు ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ అనే సమస్యతో బాధపడుతుంటారు. రాత్రి, పగలు మార్చి మార్చి పనిచేయాల్సి రావడంతో ఆ షెడ్యూల్స్కు అనుకూలంగా మీ దేహం మారలేకపోవడంతో వచ్చే సమస్య ఇది. మన మెదడులో ఒక జీవగడియారం పనిచేస్తుంటుంది. మన తిండి, నిద్రల వేళలు, అందులో నమోదై ఉంటాయి. అది నిర్వహించే క్రమబద్ధతకు ‘సర్కేడియన్ రిథమ్’ అని పేరు. ఈ రిథమ్ దెబ్బతినడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి. షిఫ్ట్‌లలో పనిచేసేవారు రోజుకు సగటున నాలుగు గంటల కంటే తక్కువగా నిద్రపోతుంటారు. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. దాంతో కొద్దిపనికే తీవ్రంగా అలసిపోతుంటారు. వాళ్ల పనిచేసే సామర్థ్యం దెబ్బతింటుంది. పొద్దున్నే పనిచేసేవాళ్లలో, రాత్రిడ్యూటీలు చేసేవారిలో, పనివేళలు తరచూ నైట్ షిఫ్టులుగా, డే షిఫ్టులుగా మారేవాళ్లలో మీరు చెబుతున్న లక్షణాలైన కోపం రావడం, తీవ్రమైన అలసట, త్వరగా ఉద్వేగాలకు లోనుకావడం వంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటివారికి పగటివేళ నిద్రమత్తుతో జోగుతూ ఉండటం, నిస్సత్తువ, దృష్టికేంద్రీకరణ సమస్యలు, తలనొప్పి, స్థూలకాయం రావడం వంటి రిస్క్‌లు ఉంటాయి. ఒక్కోసారి వారు చేసే తప్పులకు భారీమూల్యం చెల్లించాల్సి రావచ్చు. అనారోగ్యాల బారిన పడటం ఎక్కువ కావచ్చు. ఈ సమస్య నివారణ కోసం పనిచేసే సమయంలో కాఫీ వంటివి తక్కువగా తీసుకోవడం, నిద్రపోయే సమయాల్లో పరిసరాలు నిశ్శబ్దంగా ఉంచుకోవడంతో పాటు వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. షిఫ్ట్ వర్క్ డిజార్డర్‌తో బాధపడేవారికి కృత్రిమ వెలుగులో ఉంచే చికిత్స ప్రక్రియ అయిన బ్రైట్ లైట్ థెరపీ, మెలటోనిన్ మందులతో స్లీప్ మాడిఫికేషన్ థెరపీ వంటివి అందుబాటులో ఉన్నాయి. -
సొరియాసిస్‌కు పంచకర్మ
సొరియాసిస్ అని తెలిసినా పలు రకాల చర్మవ్యాధుల్లో ఇదొకటి అనుకుని చాలాకాలం దాకా పట్టనట్టే ఉండిపోతారు. కానీ ఒక దశలో ఇది ఒళ్లంతా పాకి, దురద, మంటలు మొదలవుతాయి. నిద్ర కరువవుతుంది. నిద్రలేమి ఒకటి ఉంటే చాలు ఆరోగ్యం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అన్నీ వృథా అయిపోతాయి. శరీర వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. నిద్రలేమి జీర్ణవ్యవస్థను దెబ్బతీయడమే కాదు.. శరీర ధాతువులన్నీ కుంటుపడేలా చేస్తుంది. ఫలితంగా శరీరంలోని అంతర్భాగాలన్నీ ఒక్కొక్కటిగా దెబ్బతినడంతో పాటు, నాడీ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. అందుకే సొరియాసిస్ తొలిదశలో ఉన్నప్పుడు కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకుంటే దుష్ర్పభావాలు లేకుండా దీన్ని శాశ్వతంగా నివారించవచ్చు. సొరియాసిస్‌లో ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో నిద్రలేమి అత్యంత తీవ్రమైనది. తెల్లవార్లూ దురద, మంటల కారణంగా సొరియాసిస్ పీడితులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. దీర్ఘకాలికంగా ఉంటున్న నిద్రలేమి సహజంగా అజీర్తి సమస్యకు ఆ తరువాత మలబద్దకం సమస్యకు దారితీస్తుంది. ఈ దుష్ర్పభావాలు క్రమంగా నరాల వ్యవస్థ మీద పడతాయి. ఫలితంగా అసహనం, చికాకు, కోపం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. నాడీవ్యవస్థ దెబ్బ తినడం వల్ల మెదడు పనితనం దెబ్బతింటుంది. అజీర్తి, మలబద్దకం, నరాల వ్యవస్థ దెబ్బతినిపోయిన దశలో పురుషులు లైంగిక సమస్యలు ఎదుర్కొంటారు. స్తంభన తదితర సమస్యలు కూడా మొదలవుతాయి. ఇవన్నీ సొరియాసిస్ సమస్యకు సరైన వైద్య చికిత్సలు తీసుకోవడంలో చూపిన నిర్లక్ష్య ఫలితాలే. ఆమ్లం పెరిగితే అంతే! మనం తిన్న ఆహారం సంపూర్ణంగా జీర్ణం కావడానికి పిత్తం అంటే జఠరాగ్ని అవసరం. నిద్రలేమి కారణంగా శరీరంలోని జఠరాగ్ని మందగిస్తుంది. దీనివల్ల తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాదు. జీర్ణక్రియ సరిగా పనిచేసినపుడే సప్త ధాతువులు సమర్థవంతంగా పనిచేస్తాయి. అప్పుడే జీవక్రియలు సక్రమంగా విధులను నిర్వర్తిస్తాయి. ప్రత్యేకించి ఆహార పదార్థాలు సంపూర్ణంగా జీర్ణం కానప్పుడు శరీరంలో హానికరమైన ఆమ్లం ఉత్పన్నమవుతుంది. ఇది శరీర వ్యవస్థను విషతుల్యం చేస్తుంది. నిద్ర శరీరానికే కాదు మెదడుకు కూడా అంతే అవసరం. సరైన నిద్ర లేకపోతే మెదడు పనితనాన్ని కోల్పోతుంది. మూలకారణానికి చికిత్స ఈ సమస్యలన్నీ నిద్రలేమి వల్ల తలెత్తేవే. ఇతర కారణాల చేత వచ్చే నిద్రలేమి సమస్య కన్నా సొరియాసిస్ వల్ల వచ్చే నిద్రలేమి మరింత తీవ్రమైనది. సమస్య తీవ్రమైన వారికి అసలు తెల్లవార్లూ కంటి మీద కునుకే ఉండదు. చాలా మందికి సొరియాసిస్ తల మీద చుండ్రులాగే మొదలవుతుంది. ఆ తరువాత క్రమంగా మెడ మీదికి, చెవుల మీదికి పాకుతుంది. ఆ తరువాత శరీరంలో అన్ని భాగాలకు పాకుతుంది. చర్మం ముందు దళసరిగా మారి, ఆ తరువాత చేప పొట్టులా తయారవుతుంది. తాత్కాలిక ఉపశమనానికి పరిమితమై ఏవో క్రీములు మాత్రమే రాస్తే ఈ సమస్యలన్నీ మొదలవుతాయి. కేరళ పంచకర్మ ఆయుర్వేదంలో వమనం, విరేచనం, వస్తికర్మ, నశ్యకర్మ చికిత్సలు మొత్తంగా పంచకర్మ చికిత్సలు. సొరియాసిస్‌ను సమర్థవంతంగా నయం చేస్తాయి. తైల మర్ధనాలతో పాటు కడుపులోకి ఇచ్చే కొన్ని మందులు ఆమాన్ని తొలగించి వాత, పిత్త, కఫాలను నియంత్రణలోకి తెచ్చి, సొరియాసిస్ నుంచి శాశ్వత విముక్తి కలిగిస్తాయి. సమగ్రమైన శక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి. (దూర ప్రాంతం నుంచి వచ్చే పేషంట్లకు ఇన్‌పేషంట్ సౌకర్యం కలదు) డాక్టర్ పి.కృష్ణ ప్రసాద్ శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ 9030 013 688, 9440 213 688 -
మేని మెరుపులకు... డెర్మటాలజిస్టు
మనిషి చర్మానికి 3 వేలకుపైగా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. సొరియాసిస్, స్కిన్ క్యాన్సర్, ఇన్ఫెక్షన్లు వంటివాటితో చర్మం జీవం కోల్పోతుంది. అందవిహీనంగా మారుతుంది. డెర్మటాలజిస్టులు వీటిని గుర్తించి, తగిన చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇప్పుడు డెర్మటాలిజిస్టులను ఆశ్రయించేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. డెర్మటాలజీని కెరీర్‌గా ఎంచుకుంటే ఎన్నో వెసులుబాట్లు ఉన్నాయి. ప్రధానమైంది.. అనుకూలమైన పనివేళలు. ఇతర వైద్యుల్లాగా ఎమర్జెన్సీ కేసులను చూడాల్సిన సందర్భాలు చాలా స్వల్పంగా ఉంటాయి. ఎల్లవేళలా రోగులకు అందుబాటులో ఉండాల్సిన అవసరం కూడా లేదు. నచ్చిన సమయాల్లో పనిచేసుకోవచ్చు. చికిత్స ద్వారా రోగులకు స్వస్థత చేకూరిస్తే కెరీర్‌గా పరంగా ఎదురే ఉండదు. డెర్మటాలజిస్టులకే అగ్రస్థానం భారత్‌లో నిపుణులైన డెర్మటాలజిస్టుల కొరత అధికంగా ఉంది. అనుభవం కలిగిన చర్మ వైద్యులకు భారీ డిమాండ్ ఉంది. డెర్మటాలజిస్టులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి అవకాశాలున్నాయి. విదేశాల్లోనూ వీరికి భారీ వేతన ప్యాకేజీ లభిస్తోంది. సొంతంగా క్లినిక్‌ను స్థాపించుకుంటే మంచి ఆదాయం ఆర్జించొచ్చు. దేశంలో ప్రధాన నగరాలతోపాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ కార్పొరేట్ ఆసుపత్రులు ఏర్పాటవుతున్నాయి. వీటిలో డెర్మటాలజిస్టులను తప్పనిసరిగా నియమిస్తున్నారు. ఈ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశించింది. కాస్మటిక్ డెర్మటాలజీ, లేజర్ ట్రీట్మెంట్ వంటి వాటి ద్వారా చికిత్సలు మరింత సులువుగా మారాయి. వేతనాల పరంగా ఫిజిషియన్లలో డెర్మటాలజిస్టులకు అగ్రస్థానం దక్కుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అర్హతలు: బయాలజీ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైన తర్వాత ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి ఎంబీబీఎస్(అండర్గ్రాడ్యుయేట్) డిగ్రీ పూర్తిచేయాలి. తర్వాత డెర్మటాలజీలో ఎండీ(పోస్టుగ్రాడ్యుయేట్) చదవాలి. అనంతరం ఇంటర్న్‌షిప్, రెసిడెన్సీ పూర్తిచేసి, డెర్మటాలజిస్టుగా కెరీర్ లో స్థిరపడొచ్చు. వేతనాలు: డెర్మటాలజిస్టులకు ప్రారంభంలో నెలకు రూ.40 వేల నుంచి వేతనం ప్రారంభమవుతుంది. తర్వాత అనుభవాన్ని బట్టి నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. కూల్‌గా సాగిపోయే కెరీర్.. ‘‘చర్మ సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెరిగింది. దాంతో డెర్మటాలజిస్టులకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. మారుతున్న టెక్నాలజీతో వైద్యవిధానాల్లో అనేక మార్పులు వచ్చాయి. వయసు మీదపడుతున్నపుడు ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు యాంటీ ఏజింగ్ ప్రక్రియ ప్రాచుర్యంలోకి వచ్చింది. అర్ధరాత్రి, అపరాత్రిళ్లు అత్యవసర కేసులు వచ్చే అవకాశం లేదు. అందుకే అధికశాతం మహిళా వైద్యులు డెర్మటాలజీని ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీని అప్డేట్ చేసుకోగలిగితే ఆదాయమార్గం భారీ ఎత్తున పెరిగినట్లే. డెర్మటాలజీని స్పెషలైజేషన్‌గా తీసుకున్నవారికి ప్రస్తుతం పుష్కలమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి’’ -డాక్టర్ మన్మోహన్, డెర్మటాలజీ విభాగ అధిపతి, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి డెర్మటాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ-న్యూఢిల్లీ వెబ్సైట్: ఠీఠీఠీ.ఝ్చఝఛి.్చఛి.జీ ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)-న్యూఢిల్లీ వెబ్సైట్: www.aiims.edu లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ-న్యూఢిల్లీ వెబ్సైట్: http://www.hardinge.org/ గురు తేజ్ బహదూర్ హాస్పిటల్-న్యూఢిల్లీ వెబ్సైట్: www.gtbh.delhigovt.nic.in జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స ఏపీ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ పోస్టు: అసిస్టెంట్ ఇంజనీర్; విభాగం: ఎలక్ట్రికల్ అర్హతలు: ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్/ఏఎంఐఈ ఉండాలి. వయసు: 36 ఏళ్లకు మించకూడదు.; ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 26; వెబ్సైట్: www.apeasternpower.com నవోదయ విద్యాలయ సమితి పోస్టు: ప్రిన్సిపాల్; ఖాళీల సంఖ్య: 47 అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా మాస్టర్స్ డిగ్రీ, బీఎడ్ ఉండాలి. రెసిడెన్షియల్/సీబీఎస్ఈ/రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పీజీటీ/మాస్టర్/లెక్చరర్‌గా కనీసం పన్నెండేళ్ల అనుభవం ఉండాలి.; ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 31 వెబ్సైట్: http://www.navodaya.nic.in/ భారత నావికాదళం పోస్టులు: యూనివర్సల్ ఎంట్రీ స్కీమ్-ఎస్ఎస్సీ ఆఫీసర్స్ అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.; ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 5 వెబ్సైట్: http://nausena-bharti.nic.in/ పారాదీప్ పోర్ట్ ట్రస్టు పోస్టులు: డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్(స్పెషలిస్ట్) అర్హతలు: ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో ఎండీ/డీఎన్బీ/ఎంఎస్ ఉండాలి. కనీసం ఏడేళ్ల క్లినికల్ అనుభవం అవసరం ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా; దరఖాస్తులకు చివరి తేది: జూలై 28 వెబ్సైట్: http://www.paradipport.gov.in/ నిమ్స్- హైదరాబాద్ కోర్సులు: బీఎస్సీ(నర్సింగ్) బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ నోటిఫికేషన్లో నిర్దేశించిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, వైవా ద్వారా.. దరఖాస్తులకు చివరి తేది: జూలై 16 వెబ్సైట్: http://www.nims.edu.in/ సీమ్యాట్ కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్)-2015-16(మొదటి పరీక్ష) నోటిఫికేషన్‌ను ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ(10+2+3) ఉత్తీర్ణులు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 25 వెబ్సైట్: http://www.aicte-cmat.in/ -
సోరియాసిస్‌కు మెరుగైన ఫలితం హోమియోపతి
సోరియాసిస్ వ్యాధిగ్రస్తులలో చర్మంపై దురదతో కూడిన వెండి రంగు పొలుసులు కనిపిస్తాయి. ఈ వ్యాధి ప్రభావం చర్మం మీద మాత్రమే కాకుండా గోళ్ళు, తల తదితర శరీర భాగాల మీద కూడా కనపడవచ్చు. ఎందుకు వస్తుంది? వ్యాధినిరోధకశక్తి వికటించి స్వయం ప్రేరితంగా మారడం వలన సోరియాసిస్ వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీనిని అర్థం చేసుకోవడానికి వ్యాధినిరోధకశక్తి గురించి కొంత తెలుసుకుందాం. వైరస్, బ్యాక్టీరియా వంటివి శరీరం మీద దాడి చేసినప్పుడు వాటి నుండి రక్షణ పొందటానికి మన శరీరంలో డబ్ల్యూబీసీ (తెల్ల రక్త కణాలు) అనే ప్రత్యేకమైన రక్తకణాలు పని చేస్తుంటాయి. ఇవి అవసరమైన ప్రాంతాలకు వెళ్ళి ఇన్ఫెక్షన్ తగ్గించడమే కాకుండా గాయాలు మానేలా చేస్తాయి. సోరియాసిన్ - వంశపారంపర్యత కొన్ని కుటుంబాలలో సోరియాసిన్ ఆనువంశికంగా నడుస్తుంది. తల్లిదండ్రులలో ఇద్దరికీ సోరియాసిస్ ఉంటే సంతానానికి వచ్చే అవకాశం 30 శాతం ఉంటుంది. ఒకవేళ ఒకరికే ఉంటే 15 శాతం వచ్చే అవకాశం ఉంటుంది. సోరియాసిస్ ప్రభావం సోరియాసిస్‌ను ఒక చర్మవ్యాధిగా మాత్రమే గుర్తిస్తే అది తప్పు. దీనివలన సాధారణంగా ప్రాణహాని జరగదు. కాని వ్యాధి తీవ్రత వలన, దీర్ఘకాలం బాధించడం వలన బాధితులు డిప్రెషన్‌కు లోనవుతారు. ఇది వ్యాధి తీవ్రతను మరింత పెంచుతుంది. సోరియాసిస్‌లో అలా వికటించిన వ్యాధినిరోధకశక్తి వలన సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి అనుబంధ అంశంగా గల ఇన్ఫ్లమేటీ వలన సోరియాసిస్‌తో బాధపడేవారికి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవేకాక ఈ వ్యాధిగ్రస్తులు డయాబెటిస్, రక్తపోటులకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువే. సోరియాసిస్‌ను తీవ్రం చేసే అంశాలు 1.చల్లని, పొడి వాతావరణం 2. మానసిక ఒత్తిడి 3. కొన్నిరకాల మందులు (మలేరియా మందులు, లితేలయ, బీటా, బ్లాకర్స్, మాంటి) 4. ఇన్ఫెక్షన్స్, ఇతర వ్యాధులు. 5. అలవాట్లు 6. హార్మోన్ తేడాలు 7. ఆహారపదార్థాలు-ఉదా: గ్లూటన్ ఎక్కువగా ఉండే ఆహారం. సోరియాసిస్‌లో రకాలు సోరియాసిన్ వ్యక్తమయ్యే విధానాన్ని బట్టి 5 రకాలుగా వర్గీకరించారు. ప్లేగు సోరియాసిస్: ఇది సోరియాసిస్‌లో ఎక్కువగా కనిపించే రకం. ఎర్రనిమచ్చలుగా మొదలై పెద్ద పొడగా మారడం దీని ప్రధాన లక్షణం. guttata సోరియాసిస్: ఇవి ఎర్రని పొక్కులు, పొలుసులతో వాన చినుకులలా కనిపిస్తాయి. ఈ వ్యాధి హఠాత్తుగా మొదలవుతుంది. పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. పస్టులర్ సోరియాసిన్: దీనిలో చీముతో కూడిన పొక్కులు తయారవుతాయి. ఇన్వర్సివ్ సోరియాసిన్: దీనిలో పలుచగా పొట్టు లేకుండా ఎర్రగా కనిపించే మచ్చలు చర్మపు ముడతలలో వస్తాయి. Exythrodermic సోరియాసిస్: దీనిలో ఎర్రని వాపుతో కూడిన మచ్చలు పెద్ద ఆకారంలో తయారవుతాయి. కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో సోరియాసిస్ నివారణ కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా మందులు ఇవ్వడం అంటే ఒక వ్యక్తి మానసిక, శారీరక పరిస్థితులే కాకుండా ఎమోషనల్ పరిధిని కూడా పూర్తిగా అర్థం చేసుకుని మందులు ఇవ్వడం. తర్వాత ఏయే పొటెన్సీలో ఎంత డోస్ ఇవ్వాలనేది ముఖ్యం. మైనమ్ (సోరిక్, సైకోటిక్, సిఫిలిటిక్) ను బట్టి పొటెన్సీని నిర్ణయించి మందులు ఇస్తారు. కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా సరైన మందులు, పొటెన్సీ డోస్ ఇచ్చినప్పుడు వ్యాధి పూర్తిగా నివారించబడుతుంది. సాధారణంగా వాడే మందుల వలన ఈ సోరియాసిన్ నుండి తాత్కాలికంగా తగ్గినట్లు లేదా కొన్నిసార్లు అస్సలు ఫలితమే లేకపోవడం జరుగుతుంది. అదే హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధి తీవ్రతను బట్టి నియంత్రించి పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సోరియాసిస్‌ను అరికట్టవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స కాలాన్ని నిర్ధారిస్తారు. డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై అపాయింట్మెంట్ కొరకు 9246199922