సోరియాసిస్‌కు మెరుగైన ఫలితం హోమియోపతి | Homeopathy is a better result psoriasis | Sakshi
Sakshi News home page

సోరియాసిస్‌కు మెరుగైన ఫలితం హోమియోపతి

Published Thu, Sep 26 2013 11:11 PM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM

సోరియాసిస్‌కు మెరుగైన ఫలితం హోమియోపతి

సోరియాసిస్‌కు మెరుగైన ఫలితం హోమియోపతి

సోరియాసిస్ వ్యాధిగ్రస్తులలో చర్మంపై దురదతో కూడిన వెండి రంగు పొలుసులు కనిపిస్తాయి. ఈ వ్యాధి ప్రభావం చర్మం మీద మాత్రమే కాకుండా గోళ్ళు, తల తదితర శరీర భాగాల మీద కూడా కనపడవచ్చు.
 
 ఎందుకు వస్తుంది?


 వ్యాధినిరోధకశక్తి వికటించి స్వయం ప్రేరితంగా మారడం వలన సోరియాసిస్ వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీనిని అర్థం చేసుకోవడానికి వ్యాధినిరోధకశక్తి గురించి కొంత తెలుసుకుందాం.
 
  వైరస్, బ్యాక్టీరియా వంటివి శరీరం మీద దాడి చేసినప్పుడు వాటి నుండి రక్షణ పొందటానికి మన శరీరంలో డబ్ల్యూబీసీ (తెల్ల రక్త కణాలు) అనే ప్రత్యేకమైన రక్తకణాలు పని చేస్తుంటాయి. ఇవి అవసరమైన ప్రాంతాలకు వెళ్ళి ఇన్‌ఫెక్షన్ తగ్గించడమే కాకుండా గాయాలు మానేలా చేస్తాయి.
 
 సోరియాసిన్ - వంశపారంపర్యత


 కొన్ని కుటుంబాలలో సోరియాసిన్ ఆనువంశికంగా నడుస్తుంది. తల్లిదండ్రులలో ఇద్దరికీ సోరియాసిస్ ఉంటే సంతానానికి వచ్చే అవకాశం 30 శాతం ఉంటుంది. ఒకవేళ ఒకరికే ఉంటే 15 శాతం వచ్చే అవకాశం ఉంటుంది.
 
 సోరియాసిస్ ప్రభావం


 సోరియాసిస్‌ను ఒక చర్మవ్యాధిగా మాత్రమే గుర్తిస్తే అది తప్పు. దీనివలన సాధారణంగా ప్రాణహాని జరగదు. కాని వ్యాధి తీవ్రత వలన, దీర్ఘకాలం బాధించడం వలన బాధితులు డిప్రెషన్‌కు లోనవుతారు. ఇది వ్యాధి తీవ్రతను మరింత పెంచుతుంది. సోరియాసిస్‌లో అలా వికటించిన వ్యాధినిరోధకశక్తి వలన సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి అనుబంధ అంశంగా గల ఇన్‌ఫ్లమేటీ వలన సోరియాసిస్‌తో బాధపడేవారికి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవేకాక ఈ వ్యాధిగ్రస్తులు డయాబెటిస్, రక్తపోటులకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువే.
 
 సోరియాసిస్‌ను తీవ్రం చేసే అంశాలు
 1.చల్లని, పొడి వాతావరణం 2. మానసిక ఒత్తిడి 3. కొన్నిరకాల మందులు (మలేరియా మందులు, లితేలయ, బీటా, బ్లాకర్స్, మాంటి) 4. ఇన్‌ఫెక్షన్స్, ఇతర వ్యాధులు. 5. అలవాట్లు 6. హార్మోన్ తేడాలు 7. ఆహారపదార్థాలు-ఉదా: గ్లూటన్ ఎక్కువగా ఉండే ఆహారం.
 
 సోరియాసిస్‌లో రకాలు


 సోరియాసిన్ వ్యక్తమయ్యే విధానాన్ని బట్టి 5 రకాలుగా వర్గీకరించారు. ప్లేగు సోరియాసిస్: ఇది సోరియాసిస్‌లో ఎక్కువగా కనిపించే రకం. ఎర్రనిమచ్చలుగా మొదలై పెద్ద పొడగా మారడం దీని ప్రధాన లక్షణం.
 
 guttata సోరియాసిస్: ఇవి ఎర్రని పొక్కులు, పొలుసులతో వాన చినుకులలా కనిపిస్తాయి. ఈ వ్యాధి హఠాత్తుగా మొదలవుతుంది. పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. పస్టులర్ సోరియాసిన్: దీనిలో చీముతో కూడిన పొక్కులు తయారవుతాయి. ఇన్‌వర్సివ్ సోరియాసిన్: దీనిలో పలుచగా పొట్టు లేకుండా ఎర్రగా కనిపించే మచ్చలు చర్మపు ముడతలలో వస్తాయి. Exythrodermic సోరియాసిస్: దీనిలో ఎర్రని వాపుతో కూడిన మచ్చలు పెద్ద ఆకారంలో తయారవుతాయి.
 
 కాన్‌స్టిట్యూషనల్ పద్ధతిలో సోరియాసిస్ నివారణ


 కాన్‌స్టిట్యూషనల్ విధానం ద్వారా మందులు ఇవ్వడం అంటే ఒక వ్యక్తి మానసిక, శారీరక పరిస్థితులే కాకుండా ఎమోషనల్ పరిధిని కూడా పూర్తిగా అర్థం చేసుకుని మందులు ఇవ్వడం. తర్వాత ఏయే పొటెన్సీలో ఎంత డోస్ ఇవ్వాలనేది ముఖ్యం. మైనమ్ (సోరిక్, సైకోటిక్, సిఫిలిటిక్) ను బట్టి పొటెన్సీని నిర్ణయించి మందులు ఇస్తారు. కాన్‌స్టిట్యూషనల్ విధానం ద్వారా సరైన మందులు, పొటెన్సీ డోస్ ఇచ్చినప్పుడు వ్యాధి పూర్తిగా నివారించబడుతుంది. సాధారణంగా వాడే మందుల వలన ఈ సోరియాసిన్ నుండి తాత్కాలికంగా తగ్గినట్లు లేదా కొన్నిసార్లు అస్సలు ఫలితమే లేకపోవడం జరుగుతుంది. అదే హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధి తీవ్రతను బట్టి నియంత్రించి పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సోరియాసిస్‌ను అరికట్టవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స కాలాన్ని నిర్ధారిస్తారు.
 
 డా॥టి. కిరణ్‌కుమార్
 పాజిటివ్ హోమియోపతి
 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ,
 వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై
 అపాయింట్‌మెంట్ కొరకు 9246199922

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement