సొరియాసిస్‌కు పంచకర్మ
సొరియాసిస్ అని తెలిసినా పలు రకాల చర్మవ్యాధుల్లో ఇదొకటి అనుకుని చాలాకాలం దాకా పట్టనట్టే ఉండిపోతారు. కానీ ఒక దశలో ఇది ఒళ్లంతా పాకి, దురద, మంటలు మొదలవుతాయి. నిద్ర కరువవుతుంది. నిద్రలేమి ఒకటి ఉంటే చాలు ఆరోగ్యం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అన్నీ వృథా అయిపోతాయి. శరీర వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అయిపోతుంది.
నిద్రలేమి జీర్ణవ్యవస్థను దెబ్బతీయడమే కాదు.. శరీర ధాతువులన్నీ కుంటుపడేలా చేస్తుంది. ఫలితంగా శరీరంలోని అంతర్భాగాలన్నీ ఒక్కొక్కటిగా దెబ్బతినడంతో పాటు, నాడీ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. అందుకే సొరియాసిస్ తొలిదశలో ఉన్నప్పుడు కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకుంటే దుష్ర్పభావాలు లేకుండా దీన్ని శాశ్వతంగా నివారించవచ్చు.
సొరియాసిస్‌లో ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో నిద్రలేమి అత్యంత తీవ్రమైనది. తెల్లవార్లూ దురద, మంటల కారణంగా సొరియాసిస్ పీడితులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. దీర్ఘకాలికంగా ఉంటున్న నిద్రలేమి సహజంగా అజీర్తి సమస్యకు ఆ తరువాత మలబద్దకం సమస్యకు దారితీస్తుంది. ఈ దుష్ర్పభావాలు క్రమంగా నరాల వ్యవస్థ మీద పడతాయి. ఫలితంగా అసహనం, చికాకు, కోపం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. నాడీవ్యవస్థ దెబ్బ తినడం వల్ల మెదడు పనితనం దెబ్బతింటుంది.
అజీర్తి, మలబద్దకం, నరాల వ్యవస్థ దెబ్బతినిపోయిన దశలో పురుషులు లైంగిక సమస్యలు ఎదుర్కొంటారు. స్తంభన తదితర సమస్యలు కూడా మొదలవుతాయి. ఇవన్నీ సొరియాసిస్ సమస్యకు సరైన వైద్య చికిత్సలు తీసుకోవడంలో చూపిన నిర్లక్ష్య ఫలితాలే.
ఆమ్లం పెరిగితే అంతే!
మనం తిన్న ఆహారం సంపూర్ణంగా జీర్ణం కావడానికి పిత్తం అంటే జఠరాగ్ని అవసరం. నిద్రలేమి కారణంగా శరీరంలోని జఠరాగ్ని మందగిస్తుంది. దీనివల్ల తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాదు. జీర్ణక్రియ సరిగా పనిచేసినపుడే సప్త ధాతువులు సమర్థవంతంగా పనిచేస్తాయి. అప్పుడే జీవక్రియలు సక్రమంగా విధులను నిర్వర్తిస్తాయి. ప్రత్యేకించి ఆహార పదార్థాలు సంపూర్ణంగా జీర్ణం కానప్పుడు శరీరంలో హానికరమైన ఆమ్లం ఉత్పన్నమవుతుంది. ఇది శరీర వ్యవస్థను విషతుల్యం చేస్తుంది. నిద్ర శరీరానికే కాదు మెదడుకు కూడా అంతే అవసరం. సరైన నిద్ర లేకపోతే మెదడు పనితనాన్ని కోల్పోతుంది.
మూలకారణానికి చికిత్స
ఈ సమస్యలన్నీ నిద్రలేమి వల్ల తలెత్తేవే. ఇతర కారణాల చేత వచ్చే నిద్రలేమి సమస్య కన్నా సొరియాసిస్ వల్ల వచ్చే నిద్రలేమి మరింత తీవ్రమైనది. సమస్య తీవ్రమైన వారికి అసలు తెల్లవార్లూ కంటి మీద కునుకే ఉండదు. చాలా మందికి సొరియాసిస్ తల మీద చుండ్రులాగే మొదలవుతుంది. ఆ తరువాత క్రమంగా మెడ మీదికి, చెవుల మీదికి పాకుతుంది. ఆ తరువాత శరీరంలో అన్ని భాగాలకు పాకుతుంది. చర్మం ముందు దళసరిగా మారి, ఆ తరువాత చేప పొట్టులా తయారవుతుంది. తాత్కాలిక ఉపశమనానికి పరిమితమై ఏవో క్రీములు మాత్రమే రాస్తే ఈ సమస్యలన్నీ మొదలవుతాయి.
కేరళ పంచకర్మ
ఆయుర్వేదంలో వమనం, విరేచనం, వస్తికర్మ, నశ్యకర్మ చికిత్సలు మొత్తంగా పంచకర్మ చికిత్సలు. సొరియాసిస్‌ను సమర్థవంతంగా నయం చేస్తాయి. తైల మర్ధనాలతో పాటు కడుపులోకి ఇచ్చే కొన్ని మందులు ఆమాన్ని తొలగించి వాత, పిత్త, కఫాలను నియంత్రణలోకి తెచ్చి, సొరియాసిస్ నుంచి శాశ్వత విముక్తి కలిగిస్తాయి. సమగ్రమైన శక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి.
(దూర ప్రాంతం నుంచి వచ్చే పేషంట్లకు ఇన్‌పేషంట్ సౌకర్యం కలదు)
డాక్టర్ పి.కృష్ణ ప్రసాద్
శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్
హైదరాబాద్
9030 013 688, 9440 213 688