క్రికెట్ వ్యాఖ్యాత రిచీ బెన్నాడ్ కు చర్మ కేన్సర్
సిడ్నీ: విశ్వవిఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిచీ బెన్నాడ్(84) చర్మ కేన్సర్ తో పోరాటం చేస్తున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా స్పష్టం చేశాడు. తాను కేన్సర్ కు చికిత్స తీసుకుంటున్నట్లు బెన్నాడ్ తాజాగా ప్రకటించాడు. ప్రస్తుతం చర్మ కేన్సర్ కు రేడియేషన్ థెరపీ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని తెలిపాడు. గత సంవత్సరం బెన్నాడ్ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
ఆస్ట్రేలియా క్రికెట్ లో అత్యంత గౌరవమైన వ్యక్తిగా బెన్నాడ్ స్థానం సంపాదించాడు. 1964 లో టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న అనంతరం కామెంటేటర్ అవతారం ఎత్తాడు. 1960 ప్రాంతంలో బీబీసీకి వ్యాఖ్యాతగా వ్యహరించాడు. ఆపై మూడ సంవత్సరాల తరువాత కామెంటేటర్ గా పూర్తి బాధ్యతలు తీసుకున్నాడు. అటు క్రికెట్ జర్నలిస్టుగాను, కామెంటేటర్ గాను బెన్నాడ్ విశిష్టమైన సేవలందించాడు.