Richie Benaud
-
రిచీ బెనాడ్ ఇక లేరు
సిడ్నీ : ఓ మ్యాచ్‌లో ఆసీస్ పేసర్ మెక్‌గ్రాత్ బ్యాటింగ్‌కు దిగాడు. కిందామీదా పడి రెండు పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ సమయంలో మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా పని చేస్తున్న ఓ వ్యక్తి... మెక్‌గ్రాత్ సెంచరీకి కేవలం 98 పరుగుల దూరంలోనే అవుటయ్యాడు.. అంటూ కామెంట్ విసిరారు. అంతే ప్యానెల్లో ఉన్న ఇతర సభ్యులు నవ్వు ఆపుకోలేకపోయారు. అంటే మెక్‌గ్రాత్‌కు అసలు బ్యాటింగే రాదనే విషయాన్ని వ్యంగ్యంగా చెప్పిన ఆ కామెంటేటర్ రిచీ బెనాడ్. క్రికెట్ కామెంటరీలో ప్రమాణాలను నిర్దేశించిన బెనాడ్ గురువారం రాత్రి మరణించారు. సుదీర్ఘకాలంగా చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈ ఆస్ట్రేలియా పాతతరం ఆల్‌రౌండర్ వయసు 84 ఏళ్లు. 2013లో జరిగిన కారు ప్రమాదం నుంచి కోలుకుంటున్న బెనాడ్ నిద్రలోనే తుది శ్వాస విడిచారు. 1952లో ఆసీస్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన బెనాడ్ 63 మ్యాచ్‌లు ఆడారు. 2201 పరుగులతో పాటు తన లెగ్ స్పిన్‌తో 248 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్ తరఫున మేటి టెస్టు బౌలర్‌గా పేరుతెచ్చుకున్నారు. 259 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 11,179 పరుగులతో పాటు 945 వికెట్లు తీశాడు. 1964లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బెనాడ్ ఆ తర్వాత ఆసీస్, ఇంగ్లండ్‌లో బ్రాడ్‌కాస్టర్ అవతారమెత్తారు. తన విలక్షణమైన సెటైర్లతో, కామెంట్రీని రక్తికట్టించేవారు. 1977లో వరల్డ్ సిరీస్ క్రికెట్‌ను ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన బెనాడ్... కెర్రీ-ప్యాకర్ సిరీస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిం చారు. సచిన్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు ఆయనకు నివాళులు అర్పించారు. ఐసీసీ, బీసీసీఐ సంతాపం ప్రకటించాయి. ఆసీస్ ఓ చాంపియన్ క్రికెటర్‌ను కోల్పోయిందని ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ ట్వీట్ చేశారు. అధికార లాం ఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. నిఖార్సైన ఆల్‌రౌండర్ ఆసీస్ పాతతరం క్రికెటర్లలో బెనాడ్ పాత్ర ఎప్పటికీ మరువలేనిది. దూకుడైన బ్యాటింగ్‌తో పాటు లెగ్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులకు వణుకు పుట్టించేవారు. ముఖ్యంగా భారత్‌పై బెనాడ్‌కు అద్భుతమైన బౌలింగ్ రికార్డు ఉంది. 8 టెస్టుల్లో 52 వికెట్లు తీశారు. 1956లో జరిగిన సిరీస్‌లో మూడు టెస్టుల్లో 23 వికెట్లు పడగొట్టారు. ఒక సిరీస్‌లో ఇన్ని వికెట్లు తీయడం ఏ బౌలర్‌కైనా ఇదే అత్యుత్తమం. చెన్నైలో జరిగిన ఓ మ్యాచ్‌లో 72 పరుగులకు 7 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ నమోదు చేశారు. ఇక 1959లో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 29 వికెట్లు తీశారు. బెనాడ్ ఆసీస్ తరఫున టెస్టుల్లో 2 వేల పరుగులు, 200 వికెట్లు తీసిన తొలి క్రికెటర్. కెప్టెన్‌గా కూడా తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించారు. 1958-59లో యాషెస్ గెలిచిన ఏడేళ్ల విరామం తర్వాత తిరిగి ట్రోఫీని ఆసీస్‌కు అందించారు. స్వదేశంలో 1960-61లో విండీస్‌తో జరిగిన సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. ఓవరాల్‌గా తన కెప్టెన్సీలో ఒక్క సిరీస్ కూడా బెనాడ్ కోల్పోకపోవడం విశేషం. -
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మృతి
హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత రిచీ బెనాడ్ (84) శుక్రవారం ఉదయం మరణించారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు చానల్ నైన్ ప్రకటించింది. గురువారం రాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఆసుపత్రిలో చేర్పించారు. వయసు మీరిపోవటంతో ఆయన ఆరోగ్యం వైద్యానికి సహకరించలేదు. ఆయన నిద్రలో ఉండగానే మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. 63 టెస్ట్ మ్యాచ్ లో ఆడిన రిచీ బెనాడ్..రెండు వేలు పరుగులు చేసిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. దీంతో పాటు 27.0కు పైగా సగటుతో 248 టెస్ట్ వికెట్లను తీశారు. బెన్నాడ్ 28 టెస్ట్ లకు నేతృత్వం వహించి అన్నింటా విజయం సాధించిన కెప్టెన్ గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. తన టెస్ట్ కెరీర్ లో 122 పరగులు అత్యధిక స్కోరు. కాగా, 16 సార్లు ఐదు వికెట్లను తీసిన క్రికెటర్ గా బెనాడ్ గుర్తింపు పొందాడు. కెర్రీ పాకర్స్ వరల్డ్ సిరీస్ ను ప్రవేశపెట్టడంలో కూడా బెన్నాడ్ ప్రముఖ పాత్ర వహించారు. 1930లో జన్మించిన బెనాడ్..1952 టెస్ట్ క్రికెట్ ను ఆరంభించారు. దశాబ్దానికి పైగా ఆస్ట్రేలియా క్రికెట్ కు సేవలందించారు. వెస్టిండీస్ పై తొలి టెస్ట్ ఆడిన బెనాడ్..1964 లో సౌతాఫ్రికాపై చివరి టెస్ట్ తో తన క్రికెట్ జీవితానికి స్వస్తి చెప్పారు. 1970 లో క్రికెట్ వ్యాఖ్యాతగా తన రెండో ఇన్నింగ్స్ బెనాడ్ ఆరంభించారు.నాలుగు దశాబ్దాలుగా క్రికెట్ వ్యాఖ్యాతగా సేవలందించిన బెనాడ్ ..2013లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటమే కాకుండా ఆ తదుపరి సంవత్సరం క్యాన్సర్ బారిన పడ్డారు. బెన్నాడ్ మృతిపై పలువురు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇది నిజంగా ఆస్ట్రేలియా దుర్దినంగా ప్రధాని టోనీ ఆబాట్ పేర్కొన్నారు. బెన్నాడ్ నిజంగా గొప్ప క్రికెటర్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా తనదైన ముద్ర వేశాడని ఆసీస్ ప్రస్తుత కెప్టెన్ మైకేల్ క్లార్క్ సంతాపం తెలిపాడు. -
క్రికెట్ వ్యాఖ్యాత రిచీ బెన్నాడ్ కు చర్మ కేన్సర్
సిడ్నీ: విశ్వవిఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిచీ బెన్నాడ్(84) చర్మ కేన్సర్ తో పోరాటం చేస్తున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా స్పష్టం చేశాడు. తాను కేన్సర్ కు చికిత్స తీసుకుంటున్నట్లు బెన్నాడ్ తాజాగా ప్రకటించాడు. ప్రస్తుతం చర్మ కేన్సర్ కు రేడియేషన్ థెరపీ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని తెలిపాడు. గత సంవత్సరం బెన్నాడ్ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ లో అత్యంత గౌరవమైన వ్యక్తిగా బెన్నాడ్ స్థానం సంపాదించాడు. 1964 లో టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న అనంతరం కామెంటేటర్ అవతారం ఎత్తాడు. 1960 ప్రాంతంలో బీబీసీకి వ్యాఖ్యాతగా వ్యహరించాడు. ఆపై మూడ సంవత్సరాల తరువాత కామెంటేటర్ గా పూర్తి బాధ్యతలు తీసుకున్నాడు. అటు క్రికెట్ జర్నలిస్టుగాను, కామెంటేటర్ గాను బెన్నాడ్ విశిష్టమైన సేవలందించాడు.