సాక్షి, హైదరాబాద్: న్యాయశాస్త్ర పట్టా పొందిన వారు న్యాయవాదులుగా ఎన్‌రోల్ చేసుకునేందుకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు సమర్పించవచ్చ ని బార్‌కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి శనివారం తెలిపారు. ఈ మేరకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తును పరిశీలించి ఆమోదించిన తర్వాత ఏ తేదీన వారికి ఎన్‌రోల్‌మెంట్ ఉంటుందో తెలియజేస్తామని, ఆరోజున మాత్రమే బార్ కౌన్సిల్‌కు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు.
కార్యదర్శి రేణుక పదవీ విరమణ
బార్ కౌన్సిల్ కార్యదర్శి ఎన్.రేణుక శనివారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 32 ఏళ్లుగా ఆమె బార్ కౌన్సిల్‌కు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ ఘంగా రామారావు, హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పొన్నం అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, బార్ కౌన్సిల్ కార్యదర్శిగా వి.నాగలక్ష్మిని నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment