Narasimhareddy
-
నిరాశాజనకమైన బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని ప్రముఖ ఆర్థిక వేత్త, హెచ్‌సీయూ సోషల్‌సైన్సెస్ విభాగం మాజీ డీన్ ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా వివిధ రంగాల్లో లెక్కకు మించిన వ్యక్తులు జీవనోపాధి కోల్పోవడంతో తలెత్తిన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. కరోనా ప్రభావం అధికాదాయ వర్గాలపై పడలేదన్నారు. వారి ఆదాయంలో కోత లేకపోగా మెరుగైన కొనుగోలు శక్తి కలిగి ఉన్నారని తెలిపారు. వచ్చే 25 ఏళ్లకు సంబంధించి ప్రణాళికలు మొదలుపెట్టామని ఆర్థిక మంత్రి చెబుతున్నా బడ్జెట్లో అలాంటి చర్యలేవి కనిపించలేదన్నారు. -
హైకోర్టులో రాజ్యాంగ పరిరక్షణ దినం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో ‘రాజ్యాంగ పరిరక్షణ దినం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈకార్యక్రమానికి న్యాయ మూర్తి జస్టిస్ నవీన్ రావు, హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ నవీన్‌రావు, తదితరులు ప్రసంగించారు. -
స్పీకర్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ఒకరి మృతి
మనోహరాబాద్ (తూప్రాన్): శాసనసభ స్పీక ర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టిన సంఘటన లో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లక ల్ గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. స్పీ కర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం కాన్వా య్‌తో హైదరాబాద్ నుంచి బాన్సువాడకు వెళుతున్నారు. అదే సమయంలో కాళ్లకల్ వద్ద 44వ నంబరు జాతీయ రహదారిని దాటుతు న్న దొంతిరెడ్డి నరసింహారెడ్డి (62)ని కాన్వాయ్ లోని వెనుక వాహనం ఢీ కొట్టింది. దీంతో నరసింహారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనం అక్కడే నిలిచిపోగా, స్పీకర్ మిగతా కాన్వాయ్ ముందుకు వెళ్లిపోయింది. మృతుడు దినసరి కూలీగా పని చేస్తున్నాడు. ప్రమాద సమాచారాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్టు స్థానిక ఎస్ఐ రాజాగౌడ్ చెప్పారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని స్పీకర్ ఫోన్లో చెప్పారని ఎస్ఐ వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. -
ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ దరఖాస్తు చేసుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: న్యాయశాస్త్ర పట్టా పొందిన వారు న్యాయవాదులుగా ఎన్రోల్ చేసుకునేందుకు ఆన్లైన్లోనే దరఖాస్తు సమర్పించవచ్చ ని బార్‌కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి శనివారం తెలిపారు. ఈ మేరకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తును పరిశీలించి ఆమోదించిన తర్వాత ఏ తేదీన వారికి ఎన్రోల్మెంట్ ఉంటుందో తెలియజేస్తామని, ఆరోజున మాత్రమే బార్ కౌన్సిల్‌కు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు. కార్యదర్శి రేణుక పదవీ విరమణ బార్ కౌన్సిల్ కార్యదర్శి ఎన్.రేణుక శనివారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 32 ఏళ్లుగా ఆమె బార్ కౌన్సిల్‌కు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ ఘంగా రామారావు, హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పొన్నం అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, బార్ కౌన్సిల్ కార్యదర్శిగా వి.నాగలక్ష్మిని నియమించారు. -
అమెరికాలోనే అంత్యక్రియలు..
సాక్షి, మరికల్ (నారాయణపేట): మరికల్ మండలం పెద్దచింతకుంటకు చెందిన దంపతులు ఆర్టీసీ కండక్టర్ నరసింహరెడ్డి, లక్ష్మి, కుమారుడు భరత్‌కుమార్‌రెడ్డి అమెరికాలోని టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి విధితమే. వీరి అంత్యక్రియలు పది రోజుల తర్వాత సోమవారం సాయంత్రం అమెరికాలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. తీవ్రంగా గాయపడ్డ కూతురు మౌనికారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు తెలిపారు. చదవండి: (టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం) -
జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నర్సింహారెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)కి కొత్త సారథిగా చల్లా నర్సింహారెడ్డి నియమితులయ్యారు. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా సంస్థాగత మార్పులు చేసిన ఏఐసీసీ.. రంగారెడ్డి జిల్లాకు సరూర్‌నగర్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చల్లా నర్సింహారెడ్డి పేరును ఖరారు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్‌కు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, మేడ్చల్‌కు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌కు బాధ్యతలను కట్టబెట్టింది. జిల్లా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి చల్లాతో సహా జెడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ ఏనుగు జంగారెడ్డి, మాజీ ఎంపీపీ మల్రెడ్డి రాంరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు వేణుగౌడ్, దండెం రాంరెడ్డి తదితరులు పోటీపడ్డారు. అయితే, ఇందులో చివరి వరకు చల్లా, జంగారెడ్డి పేర్లను అధిష్టానం పరిశీలించినప్పటికీ, నర్సింహారెడ్డి వైపే మొగ్గు చూపింది. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇరువురు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చల్లా నాయకత్వాన్ని సిఫార్సు చేశారు. ఈమేరకు ఆయన పేరును ప్రతిపాదిస్తూ పీసీసీకి లేఖ రాశారు. దీంతో ఆయన సారథ్యానికి అధిష్టానం పచ్చజెండా ఊపింది. మల్లేశ్‌కు ఉద్వాసన ఆరేళ్లుగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించిన క్యామ మల్లేశ్ గత ఎన్నికల ముందు ‘హస్తం’ను వీడారు. ఇబ్రహీంపట్నం టికెట్ ఆశించిన ఆయనకు నిరాశే మిగిలింది. అయితే, టికెట్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని, ఏఐసీసీ దూతలు టికెట్లను అమ్ముకున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఏకంగా ఆడియో టేపులను కూడా విడుదల చేశారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... మల్లేశ్‌ను డీసీసీ పదవి నుంచి తొలగించారు. దీంతో మల్లేశ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. ఈనేపథ్యంలో ఖాళీ అయిన డీసీసీ పదవిని చేపట్టడానికి సీనియర్లు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. శాసనసభ ఎన్నికలు ముగియడంతో పార్టీని నడపడం ఆర్థికంగా కష్టమని భావించిన ముఖ్యనేతలు.. ఈ పోస్టు వైపు కనీసం కన్నెత్తి చూడలేదు. కాగా, పదవిని ఆశించిన వారిలో వివాదరహితుడిగా పేరొందిన చల్లాకు పీసీసీ నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఇదిలాఉండగా, డీసీసీ పదవిని ఆశించిన ఏనుగు జంగారెడ్డి.. తనను ఎంపిక చేయకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా చల్లా పేరును అధిష్టానం అధికారికంగా ప్రకటించిన తరుణంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే! -
నాయినిని మంత్రివర్గం నుంచి తొలగించాలి
-
నాయినిని మంత్రివర్గం నుంచి తొలగించాలి: కిషన్‌రెడ్డి
నిజామాబాద్: తెలంగాణపై కేసీఆర్‌కు ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ రాష్ట్ర నేత కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో సంకల్ప సభ జరిగింది. ఈ సభలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ నాయకుడు మురళీధర్‌రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ బీజేపీ సభను విచ్ఛిన్న సభగా నాయిని పేర్కొనడం దారుణమన్నారు. సెప్టెంబర్ 17 నాడు జాతీయ జెండా ఎగురవేయడం విచ్ఛిన్నమా అని ప్రశ్నించారు. నిజామాబాద్ సంకల్ప సభలో ఎలా పాల్గొంటారని నాయిని కేంద్ర హోం మంత్రిని ఎలా ప్రశ్నిస్తారన్నారు. కేసీఆర్ మీరు జెండా ఎగురవేస్తారా లేదా లేకపోతే 2019 వరకూ వేచి చూస్తాం.. 2019లో బీజేపీ కార్యకర్త ముఖ్యమంత్రి అవుతారు.. అప్పుడు అధికారికంగా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన ఉత్సవాలు చేస్తాం అని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేత డీఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ నేత బస్వా లక్ష్మీనర్సయ్యలు ఈ సభలో రాజ్‌నాథ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వారికి రాజ్‌నాథ్‌సింగ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నిజాం వారసునిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ మూర్ఖుడంటూ ఆయన సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపడు.. 2019లో బీజేపీదే అధికారం అని అన్నారు. -
చిరస్మరణీయులు..రేనాటి సూర్యచంద్రులు
ఉయ్యాలవాడ: రేనాటి సూర్యచంద్రులు.. చిరస్మరణీయులని రాయలసీమ ఐడీసీ ఎస్ఈ శివారెడ్డి అన్నారు. శనివారం ఉయ్యాలవాడలోని బుడ్డా విశ్వనాథరెడ్డి స్వగృహంలో బుడ్డా వెంగళరెడ్డికి విక్టోరియా మహారాణి బహూకరించిన బంగారు పతకాన్ని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు మీద విడుదల చేయనున్న పోస్టల్ స్టాంప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాయలసీమ జిల్లాల్లో ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చినట్లు వెల్లడించారు. ఉయ్యాలవాడ మండలంలోని బోడెమ్మనూరు, ఉయ్యాలవాడ గ్రామాల్లో రూ. 3.30 కోట్లతో జరుగుతున్న ఎత్తిపోతల పథకాల నిర్మాణాను పరిశీలించామన్నారు. కుందూనదికి అనుసంధానంగా మల్లెవేముల, జూపాడుబంగ్లా, టంగుటూరు, జుర్రేరు.. అలాగే ఎస్సార్బీసీకి అనుసంధానంగా అక్కజమ్మ రిజర్వాయర్ పరిధిలోఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. కుందూనదికి అనుసంధానంగా రూ. 10 కోట్లతో లిప్ట్ ఇరిగేషన్ నిర్మాణం పనులు కొనసాగుతుండగా, రిజర్వాయర్ల పరిధిలో ఏర్పాటుకు రూ. 25 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట డీఈ తిమ్మన్న, సిబ్బంది ఉన్నారు. -
చేనేతరంగంపై పిడుగుపాటు జీఎస్టీ
సందర్భం కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ జాతీయ ఫైబర్ విధానం రూపకల్పనకు 2009 జూలై నెలలో శ్రీకారం చుట్టింది. దేశీయంగా పత్తి, కృత్రిమ నూలు మధ్య ఉన్న నిష్పత్తిని మార్చడం. కృత్రిమ నూలు ఉత్పత్తిని పెంచి, పత్తిపై ఆధారపడడాన్ని తగ్గించి ఆధునిక జౌళి రంగ అభివృద్ధి సాధించడమే ఈ ముసాయిదా ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఈ నిష్పత్తి 40:60 ఉండగా దేశంలో ఇది 59:41గా ఉన్నది. అంటే, పత్తి ఉత్పత్తి కృత్రిమ నూలుతో పోలిస్తే మన దేశంలో ఎక్కువ. అంతర్జాతీయంగా తక్కువ. మనం అంతర్జాతీయంగా ప్రస్తుతం ఉన్న పత్తి, కృత్రిమ నూలు ఉత్పతి మధ్య ఉన్న నిష్పత్తిని అందుకోవాలని ఈ ముసాయిదాలో చెప్పారు. భారతదేశం పత్తి ఉత్పత్తిలో ప్రపంచ స్థాయిలో రెండవ స్థానంలో ఉంది. 2008లో జరిగిన ఉత్పత్తి 5 బిలియన్ కేజీలు. పత్తి నూలు, పత్తి ఆధార వస్త్ర ఉత్పత్తిలో కూడా అగ్రగామి. 17 మిలియన్ కేజీల ఉత్పత్తితో సిల్క్‌లో కూడా రెండవ స్థాయిలో ఉంది. జనపనార ఉత్పత్తి 1.7 బిలియన్ కేజీలు చేరుకొని ప్రపంచంలో మొదటి స్థాయిలో ఉంది. ఏ దేశంలో కూడా ఇన్ని రకాల ఫైబర్ ఉత్పత్తులు చేసే సామర్థ్యం లేదు. ఇంతటి వైవిధ్యం కలిగిన భారత జౌళి రంగంలో కనీసం 10 కోట్ల మంది కేవలం సహజ ఫైబర్ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు సందర్భంగా జరిగిన ఒప్పందాలలో భాగముగా భారత ప్రభుత్వం దేశీయ జౌళి రంగాన్ని సంస్కరించ పూనుకున్నది. 2005లో ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా వస్త్ర వాణిజ్యం అమలులోకి వచ్చిన తర్వాత కూడా సంస్కరణల పరంపర కొనసాగింది. ఎగుమతుల ద్వారా భారత జౌళి రంగం ఇంకా వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని జౌళి విధానాలలో మార్పులు తీసుకుని వచ్చారు. ఈ మార్పులలో కుటీర, చిన్న చేనేత రంగాలకు ప్రాధాన్యం కల్పించలేదు. గత పదేళ్లలో, పెద్ద పారిశ్రామికులకు ఆధునీకరణ పేరుతో దాదాపు లక్ష కోట్ల రూపాయల రాయితీలు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఇంకా రాయితీలు, సబ్సీడీలు, ప్రోత్సాహకాలు కల్పించే దిశగా జాతీయ ఫైబర్ విధానం రూపొందించారు. జీఎస్టీ వల్ల ఆ ప్రయోజనాలు ఇంకా విస్తృతం అవుతాయి. ఇప్పటికే, గత ఇరవై ఏళ్ళ విధానపర వివక్షతో కుదేలైన చేనేత పరిశ్రమ, దాని మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు జీఎస్టీ ఒక గొడ్డలిపెట్టు. జీఎస్టీలో ఉన్న ఆలోచనలు, అమలు పద్ధతుల వల్ల, ఇన్ని ఏండ్లుగా చేనేత మీద లేని పన్ను భారం, ఇప్పుడు పడుతుంది. సహజ నూలు మీద కూడా పన్నులు కట్టాల్సి వస్తుంది. సహజ ఫైబర్ ఉత్పత్తుల మీద మాత్రం 4 నుంచి 12 శాతం వరకు భారం పడుతుంది. దీని వలన, దాదాపు పది కోట్ల చిన్న, సన్నకారు రైతులు, చేనేత కార్మిక కుటుంబాల మీద తీవ్ర దుష్ప్రభావం ఉంటుంది. భారత జౌళి రంగంలో జీఎస్టీ పెను మార్పులు తీసుకు వస్తుంది. కృతిమ నూలు దిశగా అభివృద్ధి అడుగులు వేసే ప్రతిపాదనలు చెయ్యటం ఆత్మహత్యాసదృశ్యం. గత పదేళ్లలో జాతీయ జౌళి విధానంవల్ల అనేక ప్రాంతాలలో అనేక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. పేదరికం పెరిగింది. నిపుణులు కనుమరుగవుతున్నారు. ఈ పరిస్థితుల్లో జాతీయ ఫైబర్ విధానం తీసుకు వచ్చి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నాలు చెయ్యకుండా గోరుచుట్టుపై రోకటి పోటు లాగ జీఎస్టీ పేరుతో చేనేత ఉత్పత్తి మీద భారం పెరుగుతున్నా పట్టించుకోకపోవటం అత్యంత బాధాకరం. క్లుప్తంగా, జీఎస్టీ వల్ల చేనేత మీద భారం పెరుగుతుంది. ఇప్పటికే కుదేలు అయిన పరిశ్రమకోసం, జీఎస్టీలో సహజ నూలుకు, చేనేత వస్త్రాలు మినహాయింపు ఇవ్వకపోతే, చేనేత ఉపాధి పూర్తిగా తగ్గుతుంది. చిన్న, సన్నకారు రైతులు.. చేనేత కార్మిక కుటుంబాల సమస్యలు పరిష్కారాలు ఇందులో మిళితంచేసి ఒక సమగ్ర విధానం రూపకల్పన చెయ్యాలి. దేశీయ జౌళి రంగంలోని అన్ని ఉప రంగాల ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం ఎంతైన ఉంది. జీఎస్టీ అమలులోకి వస్తే భారత జౌళి రంగం యొక్క స్వరూపం మారిపోయే అవకాశం ఉన్నది. మొదటగా, చిన్న ఉత్పత్తిదారులు కనుమరుగు అవుతారు. రెండవ దశలో దిగుమతులు మరియు విదేశీ ఉత్పత్తులు పెరిగిపోతాయి. ఈ రెండు దశల క్రమంలో సహజ నూలు ఉత్పత్తులు 60 శాతం దేశ ప్రజలకు అందుబాటులో ఉండవు. దేశీయ జౌళి రంగం యొక్క ప్రాశస్త్యం సహజ నూలు ఉత్పత్తులు కనుక వీటిని ప్రోత్సహించేలా వ్యూహాలు పొందుపరచాలి. మార్కెట్లో వినియోగదారులు మోసపోకుండా జౌళి ఉత్పత్తులకు లేబులింగ్ చట్టం తీసుకురావాలి. సహజ నూలుకోసం ఒక నిధిని ఏర్పాటు చెయ్యాలి. నూలు ధరల స్థిరీకరణకు ప్రత్యేక నియంత్రణ యంత్రాంగం ఏర్పాటు చెయ్యాలి. జీఎస్టీ మినహాయింపుల జాబితాలో చేనేత ఉత్పత్తులు, సహజ నూలు వస్త్రాలు మరియు దుస్తులను విధిగా చేర్చాలి. ఈ దిశగా, చేనేత వ్యాపార వర్గాలు, చేనేత కార్మికులు, కుటుంబాలు, చేనేత వినియోగదారులు, దేశీయ పరిశ్రమ కోసం పాటు పడే వర్గాలు కలిసికట్టుగా పని చేసి, ప్రభుత్వం మీద ఒత్తిడి చెయ్యాలి. డా డి. నరసింహారెడ్డి చేనేత జౌళి విధాన నిపుణులు ఈ–మెయిల్ : nreddy.donthi16@gmaill.com -
అనుమతించకూడని క్రీడ ఇది
ముఖ్యమంత్రి చేత లేదా ఇతర మంత్రుల చేత గవర్నర్ చేయించే ప్రమాణ స్వీకారం ఆషామాషీ వ్యవహారం మాత్రం కాదు. కొన్ని దశాబ్దాల మథనం తరువాత ఈ సంప్రదాయానికి ఒక రూపు వచ్చింది. ప్రమాణ స్వీకారం చేయించే సభ్యుల పూర్వాపరాలు తెలుసుకోవడం గవర్నర్ విధియుక్త ధర్మం. కొన్ని సందర్భాలలో గవర్నర్ బాధ్యత కూడా. ఏమైనప్పటికీ ప్రతిపక్షానికి చెంది, ప్రమాణ స్వీకారం వేళకి కూడా అదే పార్టీలో కొనసాగుతున్న శాసనసభ్యుడిని మంత్రివర్గంలో చేర్చుకునే వెసులుబాటును ప్రపంచంలోని ఏ రాజ్యాంగమూ అధికార పక్షానికి కల్పించడం లేదు. విచిత్రమైన, ఇంకా చెప్పాలంటే మున్నెన్నడూ ఎరుగని పరిస్థితి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోను నెలకొని ఉంది. ఈ పరిస్థితిలో చాలా కోణాలు ఇమిడి ఉండడమే కాకుండా, అది భారత రాజ్యాంగంతో సన్నిహిత సంబంధం కూడా కలిగి ఉంది. అంతేకాదు, పూర్వం నుంచి అమలవుతున్న కొన్ని విలువలనూ, సంప్రదాయాలనూ ఆ పరిస్థితి కుదిపివేస్తున్నది. ప్రతి పక్షానికి చెందిన సభ్యులకు మంత్రివర్గంలో చోటు కల్పించడం అలాంటి పరిస్థితిని సంకేతించేదేనని ఎవరైనా గ్రహించగలరు. ఈ మొత్తం వ్యవ హారంలో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. విపక్షం నుంచి వచ్చిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించడాన్ని తీవ్రంగా విమర్శించి, ఆ పద్ధతిని రాజకీయ దివాలాకోరుతనంగా అభివర్ణించినవారు మళ్లీ అదే విధానాన్ని పెద్ద ఎత్తున అనుసరించారు. ఈ పరిణామం సహజంగానే రాజకీయ, న్యాయ, సామాజిక, ఇతర రంగాలలో చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగ నిబంధనల మేరకు మనం ఎంచుకున్న పార్లమెంటరీ ప్రజా స్వామ్యంలో ప్రభుత్వాల ఏర్పాటు కీలకమైన చర్య. కేంద్రంలో అయినా, ఇటు రాష్ట్రాలలో అయినా ఇదే వర్తిస్తుంది. ప్రభుత్వాల ఏర్పాటులో రాష్ట్రపతి లేదా రాష్ట్రాల గవర్నర్లకు అప్పగించిన బాధ్యత కూడా కీలకమైనది. ఈ తరహా పెద్ద సంఘటనలు స్వాతంత్య్రం వచ్చిన రెండు మూడు దశాబ్దాల కాలంలో జరగ లేదు. తరువాత ఒకే పెద్ద పార్టీ గుత్తాధిపత్యం పతనమైన తరువాత ఈ సమస్య రెక్కలు విచ్చుకుంది. ఇదివరకు పరిపూర్ణమైన ప్రజా తీర్పు లభించని సందర్భంలోను, లేదా పార్టీలోనే విభేదాలు తలెత్తినప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తేది. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోను సంభవించిన పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధమైనది. ఇక్కడ రెండు సభలలోను పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితిని తీసుకువచ్చారు. వారి మెజారిటీకి ఢోకా లేని సమయంలో ఇదంతా జరగుతున్నది. ఓటరు దృష్టి ప్రధానం తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌పై నెగ్గిన ఒక శాసనసభ్యుడికి మంత్రివర్గంలో చోటు కల్పించడంతో ఈ పరిస్థితికి శ్రీకారం చుట్టినట్టయింది. ఇలాంటి ఘటనలలో ఇదే మొదటిదని గుర్తించాలి. ఒక పార్టీ తరఫున సభకు ఎన్నిక కాకపోయినా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు అందులో సభ్యులు కావడం జరుగుతూ ఉంటుంది. ఎన్నికలకు ముందే అవగాహన కుదుర్చుకున్న సందర్భంలో లేదా ఆ సభ్యుడు తన శాసన సభ్యత్వానికీ, అప్పటి దాకా ఉన్న పార్టీకీ రాజీనామా చేసినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. రాజ్యాంగంలోని 75, 164 ఆర్టికల్స్ ఇచ్చిన వెసులు బాటుతో ఇలాంటి విన్యాసాలు జరుగుతూ ఉంటాయి. చట్టసభలకు ఎన్నిక కాకున్నా మంత్రివర్గంలో సభ్యుడు కావడానికి అవి అనుమతిస్తున్నాయి. మంత్రిగా ఎన్నికై ఆరుమాసాల వరకు కొనసాగడానికి కూడా అవకాశం కల్పి స్తున్నాయి. రాజకీయ పార్టీలు ప్రవచించిన సిద్ధాంతాల మేరకు, వాటి తాత్వికతల పునాదిగా ఎన్నికలు జరిగినప్పుడే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం పరిఢ విల్లుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. విలక్షణమైన ఏ రాజకీయ పక్షమైనా మొదట దేశం గురించి, రాష్ట్రాల గురించి తన వైఖరి ఏమిటో వెల్లడి స్తుంది. ఆ మేరకు తను నమ్మిన సిద్ధాంతం పునాదిగా దేశ, రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి మార్గాలను ప్రకటిస్తుంది. ఆ విధంగానే ఆ పార్టీ సిద్ధాంతం ఆవిష్కృతమవుతుంది. దీనితో పాటు ఎప్పుడు ఎన్నికలు ప్రకటించినా, ఏ రాజకీయ పక్షమైనా అప్పటికి ఉన్న సమస్యల ఆధారంగా ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తుంది. తన పార్టీ సిద్ధాంతాలతో పాటు, ఎన్నికల ప్రణాళికలోని అంశాలను కూడా గౌరవించే వారినే ఆయా పార్టీలు తమ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఎంపిక చేస్తాయి. నీతినిజాయితీ కలిగిన ఏ అభ్యర్థి అయినా కూడా తన పార్టీ పట్ల విధేయుడిగా ఉంటారు. ఇక ఇలాంటి అభ్యర్థి పట్ల తన ఇష్టాయిష్టాలు ఎలా ఉన్నప్పటికీ ఓటరు ఎన్నికల తరువాత ఏర్పడబోయే ప్రభుత్వాన్ని దృష్టిలో ఉంచుకునే ఓటు వేస్తాడు. ప్రజాతీర్పును మరచిపోవడం అనైతికమే తనను చట్టసభకు పంపిన పార్టీని వీడిపోవడం అనేది ఆ అభ్యర్థి చేసే అత్యంత అనైతిక చర్య అవుతుంది. అయితే తనను అభ్యర్థిగా ఎంపిక చేసిన రాజకీయ పార్టీకీ, దాని సిద్ధాంతానికీ విధేయతతో ఉండడం కష్టమని భావిస్తే, అలాగే ప్రజా తీర్పు పట్ల అసంతృప్తి ఉంటే అలాంటి అభ్యర్థి తన పార్టీకి రాజీనామా చేయాలి. అలాగే ఆ పార్టీ ద్వారా తనకు లభించిన చట్టసభ సభ్వత్వానికి కూడా రాజీనామా చేయాలి. ఆపై తన అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించాలి. ఇందుకు భిన్నంగా ఎలాంటి అడుగు వేసినా రాజకీయ పక్షాల వ్యవస్థనూ, అసలు ఎన్నికల ప్రజాస్వామ్యాన్నీ అపహాస్యం చేసినట్టే. విభేదాలు తలెత్తిన సందర్భాలలో వ్యక్తులు ఆయా పార్టీలను ఎలా విడిచి పెట్టారో తెలియచేసే సందర్భాలు చరిత్రలో అనేకం కనిపిస్తాయి. అందులో ఆచార్య నరేంద్ర దేవ్ ఉదాహరణ ఒకటి. ఆయన సోషలిస్ట్ పార్టీ నుంచి చట్టసభకు ఎన్నికయ్యారు. విభేదాల కారణంగా పార్టీకే కాదు, ఆ పార్టీ ద్వారా తనకు సంక్రమించిన చట్టసభ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. తరు వాత ఉప ఎన్నిక జరిగింది. కానీ ఆ ఎన్నికలో ఆయన పోటీ చేసి పరాజయం పాలైనారు. అయినా ఆ ఎన్నికలో గెలిచిన వారి విజయం గురించి కంటే, నరేంద్రదేవ్ ఓటమినే ఇప్పటికీ చరిత్రాత్మకంగా, అత్యున్నత నైతిక ప్రమా ణాన్ని ఆవిష్కరించినదిగా రాజకీయ వర్గాలు పేర్కొంటూ ఉంటాయి. ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలా ఉన్నాయి. అధికారం కోసం వ్యక్తులు అడ్డుదారులను ఎంచుకున్నప్పుడు మాత్రమే సమస్యలు తలెత్తుతాయి. ఒక పార్టీకి జనంలో ఎలాంటి పేరు ఉన్నప్పటికీ పాలనకు సంబం ధించిన దాని శక్తి మాత్రం ఆ పార్టీ ద్వారా సభలోకి ప్రవేశించిన సభ్యుల సంఖ్య మీదే ఆధారపడి ఉంటుంది. టిక్కెట్లు ఇచ్చి గెలిపించిన సభ్యులే ఆ పార్టీకి చట్టబద్ధమైన సంపద అవుతారు. అలాకాకుండా ఫిరాయింపులను ప్రోత్సహించి మరో పార్టీ సభ్యులను చేర్చుకుంటే వారు అక్రమ సంపదే అవుతారు. అంతకు ముందు వారు పని చేసిన పార్టీకీ, దాని ద్వారా లభించిన పదవికీ రాజీనామా ఇవ్వనంతవరకు వారు అలాంటి అక్రమ సంపదే. ఎవరైనా ఒక ఉద్యోగి అక్రమాస్తులు కలిగి ఉంటే అతడు శిక్షార్హుడు. కానీ అక్రమాస్తులు కలిగిన రాజకీయ పార్టీల పట్ల అందుకు భిన్నమైన వైఖరిని అనుసరించడంలో ఎలాంటి హేతువూ కనిపించదు. ఎందుకంటే ఆ ఇద్దరు సమాజం పట్ల బాధ్యత కలిగినవారే. కానీ అక్రమ మార్గాల ద్వారా ఒక ఉద్యోగి సంపాదించే భూమి లేదా భవనం వాటంతట అవే ఎలాంటి పాత్రను నిర్వహించలేవు. అదే రాజకీయ రంగంలో అయితే అక్రమ ఆస్తి, అంటే ఫిరాయింపుదారు రహస్య కుతంత్రం ద్వారా అలాంటి చట్ట వ్యతిరేక పాత్రను నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోని పరిణామాల పట్ల ఆత్రుతనీ, బాధనీ కలిగించేటట్టు చేస్తున్నదేమిటంటే– ఇలాంటి అవమానకర పరిణా మాలను అత్యున్నత రాజ్యాంగ సంస్థలు తమ చట్టబద్ధ అధికారాల ద్వారా, సరైన సమయంలో ఆపి ఉండవచ్చునన్న వారి భావనను వెల్లడించడానికి ప్రజలు సందేహించడం లేదు. మొదట– ఇది రాజ్యాంగంలోని పదకొండో షెడ్యూలులోని నిబంధన అమలుకు సంబంధించినదని గమనించాలి. అందులో ప్రవచించిన అంశం ఎలాంటి సంధిగ్ధానికి అవకాశం లేనిది. ఆ షెడ్యూలులోని నిబంధనలు కోర్టుల ప్రమేయం లేకుండా చేసి, పార్ల మెంటును, స్పీకర్లను సంపూర్ణాధికారులను చేశాయి. సకాలంలో తీసుకున్న చర్య రాజ్యాంగబద్ధతకు శక్తిని ఇచ్చి, అందరికీ బలమైన సంకేతాన్ని అందించ గలుగుతుంది. అలా కాకుండా ఈ సమస్య తలెత్తినప్పుడు మరో కోణంతో పరిశీలిస్తే ప్రజాతీర్పును, రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని పరిహాసం చేయడానికి ‘మేనేజర్’లకు ధైర్యసాహసాలు సమకూర్చినట్టవుతుంది. ప్రమాణ స్వీకారం ఆషామాషీ కాదు రాజ్యాంగంలోని 164 షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి చేత లేదా ఇతర మంత్రుల చేత గవర్నర్ చేయించే ప్రమాణ స్వీకారం ఆషామాషీ వ్యవహారం మాత్రం కాదు. కొన్ని దశాబ్దాల మథనం తరువాత ఈ సంప్రదాయానికి ఒక రూపు వచ్చింది. ప్రమాణ స్వీకారం చేయించే సభ్యుల పూర్వాపరాలు తెలుసుకోవడం గవర్నర్ విధియుక్త ధర్మం. కొన్ని సందర్భాలలో గవర్నర్ బాధ్యత కూడా. ఏమైనప్పటికీ ప్రతిపక్షానికి చెంది, ప్రమాణ స్వీకారం వేళకి కూడా అదే పార్టీలో కొనసాగుతున్న శాసనసభ్యుడిని మంత్రివర్గంలో చేర్చు కునే వెసులుబాటును ప్రపంచంలోని ఏ రాజ్యాంగమూ అధికారపక్షానికి కల్పించడం లేదు. రాజ్యాంగం ఎడల గౌరవం లేనివారు, రాజనీతిశాస్త్ర మౌలిక సూత్రాల పట్ల పట్టింపు లేనివారు మాత్రమే ఇలాంటి అడ్డదారులకు పాల్పడతారు. క్రీడాస్థలిలో గీసిన గీతలను మరుగు పరిస్తే, అసలు ఆ క్రీడ నిబంధనలే చెరిగిపోతాయి. అలాంటి చోట ఆడిన ఆటలో గెలిస్తే, ఆ విజయం ఔన్నత్యం ఎలాంటిదో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి విధానాలకు (నిజానికి అక్రమ పద్ధతులు) రిఫరీ అభ్యంతరం చెప్పకుంటే కేవలం ఆ క్రీడ మాత్రమే కాదు, ఆ సందర్భమే ప్రాధాన్యం కోల్పోతుంది. మరొక విషయం ఏమిటంటే–పేరు మోసిన మరింత పెద్ద ఆటగాడు నిస్సంకోచంగా నిబంధ నలను ఉల్లంఘిస్తే, అంతకు ముందే ఈ పనిచేసిన వారికి ఫిర్యాదు చేసే హక్కు కూడా ఉండదు. మన మహాకావ్యం మహాభారతం ఇందుకు సంబం ధించిన ఒక ఉదాహరణ స్పష్టంగా చూపుతున్నది. అభిమన్యుడిని చంపడానికి కౌరవ పక్షంలోని అతిరథ మహారథులంతా రణనీతిని ఉల్లంఘిం చారు. అయితే వారందరికీ తరువాత అభిమన్యుడు ఎదుర్కొన్న పరిస్థితే ఎదురైంది. కానీ అందుకు నిరసన తెలిపే హక్కును వారు అప్పటికే కోల్పోయారు. దానితో అవమానకరంగా ఓడిపోయారు, లేదా మరణించారు. తమ లోపాలు, చర్యల ద్వారా రాజ్యాంగాన్ని అమలు చేసేవారు ఇలాంటి దుష్ట సంప్రదాయాలకు అవకాశం కల్పిస్తే, వాటి ముందు రాజ్యాంగం ఎలా ఓడి పోయిందో చూసి ప్రజలు నిరాశతో నిట్టూర్చక తప్పదు. రెండో విషయం: అంతా అయి పోయిన తరువాత ఇక చేసేదేమీ ఉండదు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పట్నా హైకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి -
ముగిసిన నరసింహారెడ్డి అంత్యక్రియలు
ధర్మవరం అర్బన్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్ ఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి అంత్యక్రియలు అశేష జనవాహని మధ్య పూర్తయ్యాయి. ధర్మవరం మండలంలోని రేగాటిపల్లిలో ఆదివారం నరసింహారెడ్డి మృతదేహానికి వైఎస్సార్సీపీ నాయకులు నివాళులర్పించారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి, సీఈసీ సభ్యుడు తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి, గిర్రాజు నగేష్, నాయకురాలు గంగుల భానుమతి, సుధీర్, రాజీవ్‌రెడ్డి తదితరులు నరసింహారెడ్డి పార్థివదేహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. భారీగా తరలివచ్చిన జనం న్చరసింహారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. అంతిమయాత్రలో అడుగడుగునా పూల వర్షంతో తమ అభిమాన నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. -
ఘోరం..
శబరిమలకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం ధర్మవరం మండలానికి చెందిన ఇద్దరు మృతి మృతుల్లో వైఎస్సార్ ఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి మరొకరు ఆయన స్నేహితుడు మోహన్‌రెడ్డి రెండు కుటుంబాల్లో విషాదం ధర్మవరం రూరల్ : అయ్యప్పమాల ధరించి శబరిమలకు వెళుతున్న ఇండికా కారు ముందు వెళుతున్న లారీని ఢీకొంది. తమిళనాడులో జరిగిన ఈ ప్రమాదంలో ధర్మవరం మండలానికి చెందిన ఇద్దరు దుర్మరణం చెందారు. మృతుల్లో వైఎస్సార్ విద్యార్థి విభాగం (వైఎస్సార్‌ఎస్‌యూ) రాష్ట కార్యదర్శి సి.నరసింహారెడ్డి (26), ఆయన స్నేహితుడు మోహన్‌రెడ్డి ఉన్నారు. మృతుల బంధువులు, సన్నిహితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రేగాటిపల్లికి చెందిన నరసింహారెడ్డి ఇటీవల అయ్యప్పమాల ధరించాడు. తనతోపాటు అయ్యప్ప మాల ధరించిన వినోద్ గౌడ్, నారాయణస్వామితో పాటు స్నేహితుడు మోహన్‌రెడ్డి (28), అమరనా«థ్‌రెడ్డి, శ్రీకాంత్‌తో కలిసి నరసింహారెడ్డి గురువారం సాయంత్రం శబరిమలకు ఇండికా కారులో బయల్దేరారు. శుక్రవారం తెల్లవారుజామున తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ వద్ద ముందు వెళుతున్న లారీని వెనుక వైపు నుంచి ఇండికా కారీ ఢీకొంది. కారులో ముందు భాగంలో కూర్చున్న నరసింహారెడ్డి, డ్రైవింగ్ చేస్తున్న మోహన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీటులో కూర్చున్న రేగాటిపల్లికి చెందిన అమరనాథర్రెడ్డికి చేయి విరిగింది. అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్, నారాయణస్వామి, కుణుతూరుకు చెందిన వినోద్‌గౌడ్ స్పల్పంగా గాయపడ్డారు. మృత్యువులోనూ వీడని స్నేహ బంధం : మృతులు నరసింహారెడ్డి, మోహన్‌రెడ్డి కళాశాల స్థాయి నుంచే మిత్రులు. డిగ్రీ అనంతరం నరసింహారెడ్డి ఎస్కే యూనివర్సిటీలో పీజీలో చేరగా, ధర్మవరానికి చెందిన మోహన్‌రెడ్డి కారును కొనుగోలు చేసి, అద్దెకు తిప్పుతుండేవాడు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. విద్యార్థి దశ నుంచే ఉద్యమ బాట : రేగాటిపల్లికి చెందిన భాస్కర్‌రెడ్డి, శివమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో చివరి వాడు నరసింహారెడ్డి. డిగ్రీ వరకు ధర్మవరంలోనే చదివారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. అనంతరం వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులై, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఎస్కేయూలో పీజీ చేరి అక్కడ కూడా విద్యార్థి సమస్యల కోసం ఉద్యమించారు. నేడు అంత్యక్రియలు : మృతదేహాలను శనివారం తెల్లవారుజామున స్వగ్రామాలకు తీసుకువచ్చే అవకాశం ఉందని బంధువులు తెలిపారు. శనివారం అంత్యక్రియలు ఉంటాయని వారు చెప్పారు. -
విద్యార్థి నాయకుడికి నివాళి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి మృతికి ఎస్కేయూ విద్యార్థి ఐక్య వేదిక నాయకులు యూనివర్శిటీ ఎదుట శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ నరసింహారెడ్డి విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారన్నారు. ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన మృతికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం ఐక్య నాయకులు ఎల్లారెడ్డి, క్రాంతికిరణ్, జయచంద్రారెడ్డి, పులిరాజు, మల్లికార్జున, ముస్తఫా, భానుప్రకాష్‌రెడ్డి, మహేంద్ర, శ్రీనివాసులు, సురేష్‌కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రిక్స్ పోటీల వేదికలు ఖరారు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : 2016–2017కి గ్రిక్స్ పోటీలు నిర్వహించే వేదికలను ఖరారు చేసినట్లు ఏడీఎస్ఎస్ఏఏ కార్యదర్శి నరసింహారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రిక్స్ పోటీల్లో పాల్గొనడానికి ఎంట్రీ ఫీజులు చెల్లించేందుకు ఈనెల 23 వరకూ గడువు పెంచామన్నారు. దీనికి జిల్లాలోని అన్ని జెడ్పీ, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు ఎంట్రీ ఫీజు చెల్లించాలన్నారు. జోన్1– జెడ్పీ ఉన్నత పాఠశాల – చియ్యేడు జోన్2– ప్రభుత్వ ఉన్నత పాఠశాల – తాడిపత్రి జోన్3– ఎస్జేపీ ఉన్నత పాఠశాల – గుంతకల్లు జోన్4– జెడ్పీ ఉన్నత పాఠశాల – రామగిరి జోన్5 (బాలురు)– జెడ్పీ ఉన్నత పాఠశాల – కంబదూరు జోన్5 (బాలికలు)– జెడ్పీ ఉన్నత పాఠశాల – జుంజురాంపల్లి జోన్6– ప్రభుత్వ ఉన్నత పాఠశాల– పెనుకొండ జోన్7– జెడ్పీ ఉన్నత పాఠశాల – పరిగి జోన్8– జెడ్పీ ఉన్నత పాఠశాల – నల్లచెరువు సెంట్రల్ జోన్ – కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల – అనంతపురం