అనంతపురం సప్తగిరి సర్కిల్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి మృతికి ఎస్కేయూ విద్యార్థి ఐక్య వేదిక నాయకులు యూనివర్శిటీ ఎదుట శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తులతో నివాళి అర్పించారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ నరసింహారెడ్డి విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారన్నారు. ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన మృతికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం ఐక్య నాయకులు ఎల్లారెడ్డి, క్రాంతికిరణ్, జయచంద్రారెడ్డి, పులిరాజు, మల్లికార్జున, ముస్తఫా, భానుప్రకాష్‌రెడ్డి, మహేంద్ర, శ్రీనివాసులు, సురేష్‌కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి నాయకుడికి నివాళి
Published Fri, Dec 9 2016 11:41 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM
Advertisement
Advertisement