ముగిసిన నరసింహారెడ్డి అంత్యక్రియలు
ముగిసిన నరసింహారెడ్డి అంత్యక్రియలు
Published Mon, Dec 12 2016 12:39 AM | Last Updated on Tue, May 29 2018 3:46 PM
ధర్మవరం అర్బన్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్ ఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి అంత్యక్రియలు అశేష జనవాహని మధ్య పూర్తయ్యాయి. ధర్మవరం మండలంలోని రేగాటిపల్లిలో ఆదివారం నరసింహారెడ్డి మృతదేహానికి వైఎస్సార్‌సీపీ నాయకులు నివాళులర్పించారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి, సీఈసీ సభ్యుడు తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి, గిర్రాజు నగేష్, నాయకురాలు గంగుల భానుమతి, సుధీర్, రాజీవ్‌రెడ్డి తదితరులు నరసింహారెడ్డి పార్థివదేహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.
భారీగా తరలివచ్చిన జనం
న్చరసింహారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. అంతిమయాత్రలో అడుగడుగునా పూల వర్షంతో తమ అభిమాన నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు.
Advertisement
Advertisement