
సిరిసిల్ల: టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌ను తెలంగాణ పవర్‌లూమ్ అండ్ టెక్స్‌టైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిరిసిల్లకు చెందిన గూడూరి ప్రవీణ్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు చైర్మన్‌గా, సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) వైస్ చైర్మన్‌గా, ‘సెస్’పర్సన్ ఇన్‌చార్జిగా ఆయన పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment