భర్త వేధింపులకు టెక్కీ బలి | Bengaluru Techie Shilpa Found Dead Due To Dispute Between Husband And Wife, More Details Inside | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులకు టెక్కీ బలి

Aug 29 2025 7:46 AM | Updated on Aug 29 2025 11:53 AM

bengaluru techie shilpa incident

కర్ణాటక: మహిళా ఐటీ ఇంజినీరు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన బెంగళూరులో జరిగింది. ఎస్‌జె పాళ్యలో నివాసం ఉంటున్న శిల్ప (26) ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త ప్రవీణ్‌ చెబుతున్నాడు. సుద్దగుంటపాళ్యలోని నివాసంలో ఆమె ఉరివేసుకున్న స్థితిలో శవమై తేలింది. శిల్పాను ప్రవీణ్‌ కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

 ప్రవీణ్‌ వేధింపులు, చిత్రహింసలు కారణంగా ఇలా జరిగిందని వారు విలపించారు. శిల్ప ఓ ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా ప్రవీణ్‌ పానీపూరి వ్యాపారం చేసేవాడని, అనుమానంతో నిత్యం వేధించేవాడని చెప్పారు. పెళ్లి సంబంధం సమయంలో తాను ఐటీ ఇంజినీరని అబద్ధాలు చెప్పాడని తెలిపారు.  ఫిర్యాదు ఆధారంగా భర్త ప్రవీణ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement