సాక్షి, సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్‌లో 4 సజీవ జలధారలను సృష్టించామని కేసీఆర్ తెలిసారు. తాము గోదావరి నదిని నిండుగా ప్రవహించేలా చేస్తే.. నాలుగు నెలల్లో జలధారాలు ఎండిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. నీటి నిర్వహణ తెలియని దద్దమ్మలు రాజ్యమేలుతున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం అనేక అడ్డగోలు హామీలు ఇచ్చిందని.. ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చలేదని మండిపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యమే కారణం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా.. సిరిసిల్ల తెలంగాణా భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాల మేర పంట ఎండిపోయిందన్నారు. ఇది కాలం తెచ్చిన కరువా.. కాంగ్రెస్ తెచ్చిన కరువా.. మంత్రులు తెచ్చిన కరువా అని ప్రశ్నించారు. వర్షపాతం లేదని మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్న కేసీఆర్.. నీటిని వాడే విధానం తెలియని ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని విమర్శించారు. పంటలు ఎండటానికి కరెంట్ కోతలు కూడా కారణమని దుయ్యబటారు.
ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం
క్వాలిటీ కరెంట్, రైతుబంధు ఇవ్వకుండా ప్రభుత్వం కాలం గడిపేస్తుందని మండిపడ్డారు కేసీఆర్. ‘వంద రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని చెప్పాను. చనిపోయిన 209 మంది రైతుల జాబితాను 4 గంటల్లోనే ప్రభుత్వానికి పంపించాను. లిస్ట్ ఇస్తే సాయం చేస్తామన్న సీఎం.. ఉలుకు, పలుకు లేకుండా పోయాడు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించాలి. పరిహారం ఇవ్వకుంటే వాళ్లందరి ఉసురు తగులుతుంది. ఈ ప్రభుత్వాన్ని వదిలి పెట్టం. తప్పించుకులేరు. వీపు విమానం మోత మోగించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
వ్యవసాయ సంక్షోభం వచ్చింది
ఇప్పటికీ రైతుబంధు పూర్తిగా ఇవ్వలేదు. బ్యాంకర్లతో ఎందుకు సమావేశాలు నిర్వహించలేదు. పంటలకు బోనస్ ఇస్తామన్నారు. జొన్నపంట కొనడం లేదనే ప్రచారం జరుగుతోంది. రుణమాఫీపై తెలంగాణలో పెద్ద సంక్షోభం వచ్చేలా ఉంది. ఈ ప్రభుత్వంలో వ్యవసాయం సంక్షోమం వచ్చింది. ఈ సంక్షోభానికి జబాబుదారీ ఎవరూ?. దళితబంధు 12 లక్షలు ఇస్తామన్నారు.. ఏమైంది? మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే రోజులు దాపురించాయని నేతన్నలు చెబుతున్నారు. నేతన్నలను ఆదుకోవాలని అప్పట్లో మొర పెట్టుకున్నా. 14 ఏళ్ల కిందట చేనేత కార్మికుల బతుకు ఎలా ఉండేదో ఇప్పుడూ అలాంటి పరిస్థితే తెచ్చారు.
నాలుగు నెలల్లోనే విధ్యుత్ కొరత
దళితబంధు కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇంట్లో ఇద్దరికి రూ. 4 వేల పెన్షన్ ఇస్తామన్నారు. 30 లక్షల కుటుంబాలకు నెలకు రూ. 6 వేల బాకీ ఉన్నారు. డిసెంబర్‌లో చేస్తామన్న రుణమాఫీ ఏమైంది? కళ్యాణలక్ష్మికి తులం బంగార కలిపి ఇస్తామన్నారు.. ఏమైంది? ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ఇవ్వలేదు. గతంలో కంటే ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉంది. 9 ఏళ్లు వచ్చిన నిరంతర కరెంట్ ఇప్పుడెందుకు రావడం లేదు. ఈ నాలుగు నెలల కాలంలో విద్యుత్ కొరత ఎందుకొచ్చింది. ఇది మనుషులు సృఫ్టించిన కృత్రిమ కరువు.
మేం కేసులు పెట్టి జైల్లో వేయలేమా?
కాళేశ్వరం ఎంత త్వరగా పూర్తైతే అంత మంచిదని భావించాం. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు ఉన్నవాళ్లకు తోక కూడా తేలీదు. అన్ని బరాజ్‌ల మీద దాదాపు 200పైగా గగేట్లు ఉంటాయి. మేడిగడ్డ బరాజ్‌లో గోదవారి పోంగే మూడు నెలలు గేట్లు ఎత్తి ఉంటాయి. కొట్టుకుపోయిన మిడ్‌మానేరు కట్ట కట్టింది కోమటిరెడ్డి కంపెనీ కాదా?. మేం అనుకుంటే అప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టేవాళ్లం కాదా?. మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే కన్నెపల్లి వద్ద ఎత్తిపోతలు.
మేడిగడ్డ కుంగిందని కేసీర్‌ను బద్నాం చేయాలని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నదులు, బ్యారేజ్‌లు దగ్గర ఇసుక కుంగడం సహజం. పిల్లర్ల కింద ఇసుక కదిలి రెండు పిల్లర్లు కుంగినయ్. మీకు చేతకాకుండే 50 వేల మంది రైతులను తీసుకుపోతం. తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ నుంచి నీళ్లు తెస్తాం. కాళేశ్వరం పని అయిపోయిందన్నోళ్లు మొన్న నీళ్లు ఎలా పంపింగ్ చేశారు. ప్రజల గొంతులు ఎందుకు ఎండబెడుతున్నారు. ఇప్పటి వరకు ఊరుకున్నాం ఇకపై ఊరుకోం. రాష్ట్రం రణరంగం అయినా సరే’ అని కేసీఆర్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment