సాక్షి, సిరిసిల్ల: అన్ని రంగాల్లో సిరిసిల్ల అభివృద్ధి చెందుతోంది. వివిధ పథకాల ద్వారా నేతన్నకు అండగా నిలుస్తున్నామన్నారు. మరమగ్గాల కార్మికులకు నేతన్న బీమా అమలు చేస్తున్నమని తెలిపారు. సిరిసిల్లా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నల సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు.
దేశంలోనే వ్యవసాయరంగంతో పాటు.. అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. దుక్కి దున్నిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటోందన్నారు. గత ప్రభుత్వాలు 200 వందల పెన్షన్ ఇస్తే కేసీఆర్ రూ. 2016, వికలాంగులకు 4016 ఇస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హర్ ఘర్ జల్ యోజన పథకం ప్రారంభించామని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గురుకులాలు ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందిస్తున్నామన్నారు.
అమ్మ ఒడి వాహనం, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలను నీతి అయోగ్ అభినందించిందని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానా అనే నినాదం నుంచి ఛలో పోదాం పదరా సర్కారు దవాఖానాకు అనేలా రోగులకు తెలంగాణ ప్రభుత్వం భరోసానిచ్చిందని పేర్కొన్నారు. గురుకులాల్లో చదివే విద్యార్థులపై 1 లక్షా 25 వేలు ఖర్చు చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన స్వచ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 సర్వేలో పారిశుధ్య విభాగంలో తెలంగాణాకు ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చిందని.. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు.
చదవండి: తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగం: సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment