రేవంత్‌ డౌన్‌ డౌన్‌.. బెటాలియన్‌ పోలీసుల ధర్నా! | Battalion Police Protest AT Nalgonda And Sircilla, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Battalion Police Protest: రేవంత్‌ డౌన్‌ డౌన్‌.. బెటాలియన్‌ పోలీసుల ధర్నా!

Published Sat, Oct 26 2024 12:16 PM | Last Updated on Sat, Oct 26 2024 3:43 PM

Battalion police Protest AT Nalgonda And Sircilla

సాక్షి, నల్లగొండ: తెలంగాణ పోలీసుల్లో తిరుగుబాటు మొదలైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులపై తాజాగా పోలీసులు సిబ్బంది   ధర్నాకు దిగారు. నల్లగొండలో ఎస్‌ఐను సస్పెండ్‌ చేయాలని బెటాలియన్‌ పోలీసులు డిమాండ్‌ చేయగా.. సిరిసిల్లలో సీఎం రేవంత్‌ డౌన్‌ డౌన్‌ అంటూ పోలీసులు నినాదాలు చేశారు.

వివరాల ప్రకారం.. నల్లగొండలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో సిబ్బంది మరోసారి ఆందోళన దిగారు. నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబును సస్పెండ్ చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆందోళన చేస్తున్న తమతో పాటు తమ కుటుంబ సభ్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ సిబ్బంది ఆరోపించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున నినాదాలు చేస్తూ బెటాలియన్ నుంచి రోడ్డుపైకి ర్యాలీగా వస్తున్న సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. గేట్లు వేయడంతో సిబ్బంది బయటకు రాకుండా ఆగిపోయారు.

రాష్ట్రంలో ఏక్‌ పోలీస్‌ విధానం కోసం .. ఆందోళన..!

 

 

మరోవైపు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17వ బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ దగ్గర పోలీసులు నిరసన, ధర్నాకు దిగారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ  డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేశారు. మాకు  డ్యూటీలు వేసి కుటుంబాన్ని దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. మాతో లోపల కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేయిస్తున్నారని చెప్పారు. ఈ సందర్బంగా ధర్నా చేస్తున్న కానిస్టేబుల్ వద్దకు జిల్లా ఎస్పీ అఖిల్ చేరుకొని పోలీసులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో ఎస్పీ కాళ్లపై పడి తమ బాధను తీర్చాలని కానిస్టేబుల్‌ వేడుకున్నారు. 

 

 

 Video Credit: Telugu scribe

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement