రెండు రోజుల్లో స్వగ్రామాలకు దుబాయ్‌ బాధితులు  | KTR Letter To Dubai Embassy For Telangana People | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో స్వగ్రామాలకు దుబాయ్‌ బాధితులు 

Published Tue, Oct 11 2022 2:23 AM | Last Updated on Tue, Oct 11 2022 2:23 AM

KTR Letter To Dubai Embassy For Telangana People - Sakshi

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గల్ఫ్‌ ఏజెంట్ల మోసంతో దుబాయ్‌ విమానాశ్రయంలో చిక్కుకున్న యువకులు రెండు రోజుల్లో స్వగ్రామాలకు రానున్నారు. విమానాశ్రయంలో ఉన్న యువకులకు మంత్రి కేటీఆర్‌ బాసటగా నిలిచారు. దుబాయ్‌లో ఉన్న తెలంగాణకు చెందిన కొందరు మిత్రులను సంప్రదించి.. తన సొంత డబ్బులు వెచ్చించి వారికి వసతులు కల్పించారు.

ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న  గుగులోతు అరవింద్, బర్దిపురం నరేందర్, గొల్లపల్లి రాము, పెద్దొల్ల స్వామి, తిరుమలేశ్,  అనిల్‌కు అక్కడి కంపెనీ ఎగ్జి ట్‌ వీసాలు రెండు రోజుల్లో అందేలా మంత్రి చర్యలు తీసు కున్నారు. దుబాయ్‌ రాయబార కార్యాలయానికి ప్రభు త్వం తరఫున సహాయం కోరుతూ కేటీఆర్‌ లేఖ రాశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement