
తంగళ్లపల్లి (సిరిసిల్ల): ‘టీఆర్‌ఎస్ నాయకులు వేధిస్తున్నారు. ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. డబ్బుల కోసం వేధిస్తున్నారు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బద్దెనపల్లికి చెందిన మ్యాన పద్మ ఆరోపించారు.
అధికార పార్టీ నాయకుల వేధింపులు భరించలేకపోతున్నానని, తనకు చావే శరణ్యమంటూ బుధవారం ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నించారు. వివరాల ప్రకారం.. బాధితురాలు పద్మ బద్దెనపల్లిలో కిరాణా దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తనకున్న స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టగా.. స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేస్తూ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నించారు. అప్రమత్తమైన స్థానికులు ఆమె నుంచి పెట్రోల్ బాటిల్‌ను లాగేశారు.
Comments
Please login to add a commentAdd a comment