
కుమారులతో అనూష
బోయినపల్లి(చొప్పదండి): అత్తింటి వేధింపులకు మూడు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఇంటి అవసరాలకు చేసిన అప్పులు తీర్చాలం టూ భర్త, అత్తమామలు వేధించడంతో ఇద్దరు కుమారులతో కలసి తల్లి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో గురువారం ఈ సంఘటన జరిగింది. బోయినపల్లికి చెందిన బొజ్జ అనూష (23) పోతర్ల మహిపాల్ ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.
వీరికి మోక్షిత్ (3), మణి (18 నెలలు) అనే కుమారులు ఉన్నారు. కుటుంబ అవసరాలకు రూ.5 లక్షల వరకు అప్పులయ్యాయి. ఈ నేపథ్యంలో జీవనోపాధికి మహిపాల్ ఇటీవల గల్ఫ్ వెళ్లా డు. అనూష ఇద్దరు పిల్లలతో ఇంటి వద్దనే ఉంటోంది. కాగా, అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వస్తుండడంతో వాటిని అనూషనే తీర్చాలంటూ అత్తామామలు సత్తవ్వ–లచ్చయ్యతోపాటు గల్ఫ్‌లో ఉంటున్న భర్త మహిపాల్ ఫోన్‌లో వేధించారు.
దీంతో మానసిక వేధింపులు భరించలేక అనూష కుమారులు మోక్షిత్, మణిలతో కలసి గ్రామ సమీపంలోని వ్యవసాయబావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. బుధవారం రాత్రి అప్పుల విష యంపై ఇంట్లో గొడవ జరిగినట్లు సమాచారం. తన కూతురు అనూష, మనుమలు మోక్షిత్, మణిల చావుకు కారకులైన అత్త పోతర్ల సత్తవ్వ, మామ పోతర్ల లచ్చయ్య, భర్త మహిపాల్‌పై చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment