ఎస్‌ఐకి ఫిర్యాదు చేస్తున్న చిన్నారి భరత్
సాక్షి, ముస్తాబాద్ (సిరిసిల్ల):‘సార్ మా నాన్న రోజూ తాగొచ్చి అమ్మను, నన్ను, చెల్లిని కొడుతున్నడు.ఎందుకు కొడుతున్నడో ఏమో..’ అమ్మే పనికి పోతది.. మాకు బువ్వ పెడుతది. అమ్మ దగ్గరున్న పైసలు గుంజుకుని రోజూ పొద్దున్నే తాగుతున్నడు.. ఇంటికొచ్చి కొడుతున్నడు..’ అంటూ ఎనిమిదేళ్ల బాలుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు.
రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన జంగం భరత్ (8) అంబేడ్కర్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. తన తండ్రి తీరుకు విసిగిపోయి గురువారం ఉదయం ఒక్కడే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. బాలుడి ఫిర్యాదుపై స్పందించిన ఎస్‌ఐ భరత్ తల్లిదండ్రులు దీపిక, బాలకిషన్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. బాలకిషన్‌కు తెలిసిన డ్రైవింగ్ పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాలని కౌన్సెలింగ్ ఇచ్చారు.
బాలకిషన్ వేధింపులను భార్య దీపిక కూడా కన్నీటిపర్యంతమవుతూ ఎస్‌ఐకి వివరించింది. పిల్లలను బాగా చదివించాలని, తాము అండగా ఉంటామని ఎస్‌ఐ భరోసా ఇచ్చారు. భరత్‌ను హాస్టల్‌లో చేర్పిస్తాననగా.. తాను గురుకులంలో సీటు సాధిస్తానని.. పోలీస్ కావడమే తన లక్ష్యమని చెప్పడం విశేషం. చిన్న వయస్సులోనే సమస్య పరిష్కారానికి వచ్చిన బాలుడిని ఎస్సైతో పాటు అక్కడున్న సిబ్బంది అభినందించారు.
చదవండి: హయత్ నగర్‌లో దారుణం.. టీచర్ మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment