
సిరిసిల్ల టౌన్: శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న శిశువుకు 108 సిబ్బంది సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు నిలిపారు. యాదాద్రి జిల్లాకు చెందిన దండుగుల దేవకి మూడో కాన్పు కోసం సిరిసిల్ల లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం చేరి ఆదివారం మగ శిశువుకు జన్మనిచ్చింది. నెలలు నిండకుండా జన్మించిన శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోగా..
మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని మాతా శిశు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో శిశువు శ్వాస ఆగిపోయింది. అప్ర మత్తమైన 108 సిబ్బది అనిల్ కుమార్, పెద్ది శ్రీనివాస్ నోటి ద్వారా కృత్రిమశ్వాస అందిం చడంతో బాబు శ్వాస తీసుకోవడం మొదలు పెట్టాడు. ప్రస్తుతం శిశువు మాతాశిశు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాబు ఆరోగ్యపరిస్థితి నిలకడ గా ఉందని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment