respiratory problem
-
అప్రమత్తతే అత్యంత కీలకం.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకర పరిస్థితులు!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఇన్‌ఫ్లూయెంజా లైక్ ఇల్నెస్ (ఐఎల్ఐ), సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (ఎస్ఏఆర్ఐ)... గత కొంత కాలంగా వైద్య పరిభాషలో తరచుగా వినియోగిస్తున్న పదాలివి. ఆస్పత్రుల్లో జ్వరం, తీవ్ర శ్వాసకోశ సమస్యలకు సంబంధించిన కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సీజన్ మార్పు నేపథ్యంలో జ్వరాలు, జలుబు, దగ్గు లక్షణాలు రావడం సహజమే అయినప్పటికీ ప్రస్తుతం వీటి తీవ్రత కాస్త ఎక్కువగా ఉంటోంది. వైరస్ ప్రభావంతో వస్తున్న ఈ సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైద్యుల సహకారాన్ని తీసుకోవాలని, ప్రభుత్వ వైద్య సేవలను విస్తృతం చేసిన క్రమంలో ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెచ్చరిస్తోంది. ఈ మేరకు దేశంలోని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. జాగ్రత్తలు తప్పనిసరి... ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐఎల్ఐ, ఎస్ఏఆర్ఐ కేసులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. రాష్ట్రాల వారీగా వచ్చిన నివేదికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తే వీటి పెరుగుదల స్పష్టమవుతోంది. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ సభ్యులు, సంబంధిత శాఖలు, సంస్థలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా పరిస్థితులను సమీక్షించిన అనంతరం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రాలకు పలు అంశాలపై సూచనలు చేసింది. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లోనూ ఈ అంశాలను ప్రస్తావిస్తూ తక్షణ చర్యలను సూచించింది. తాజాగా నమోదవుతున్న జ్వరాలు, శ్వాస కోశ సంబంధిత వ్యాధులకు కారణం హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 వైరస్ ప్రభావం ఉన్నట్లు అధ్యయనా లు చెబుతున్నాయి. ఈ వైరస్ ప్రభావంతో వస్తున్న వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశా లు ఎక్కువగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలున్నవారు వెంటనే వైద్యుడి సంరక్షణలో జాగ్రత్తలు పాటించి చికిత్స పొందాలని చెపుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపై ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉండటంతో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వైరస్ సోకిన వ్యక్తులతో మెదిలే సమయంలో మాసు్కలు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించడం, చేతులు క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం లాంటి చర్యలు తప్పకుండా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచనలు జారీ చేసింది. కోవిడ్–19 జాగ్రత్తలు మరవద్దు.. దేశవ్యాప్తంగా కోవిడ్ కట్టడిలో ఉన్నా.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వ్యాధుల తీరును పరిశీలి స్తే కోవిడ్ కేసుల పెరుగుదలకు అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ అంశాలను తప్పకుండా పాటించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జ్వరాలు, శ్వాస సంబంధిత వ్యాధులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగించాలని, జాగ్రత్త చర్యలపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. అదేవిధంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచాలని, వైద్య పరికరాల పనితీరును సరిచూసుకోవాలని కోరింది. ఆక్సిజన్ వస తులను పునఃసమీక్షించుకోవాలని స్పష్టం చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు అన్ని రకాల ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని ఆదేశించింది. కాగా, ‘గత కొన్ని నెలలుగా కోవిడ్–19 కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ టెస్ట్ పాజిటివిటీ రేట్ క్రమంగా పెరుగుతుండటం తక్షణమే పరిష్కరించాల్సిన అంశం’అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శనివారం రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసులు తక్కువగానే ఉంటున్నా, కోవిడ్ కట్టడికి ఐదంచెల వ్యూహం అమలుపై అప్రమత్తంగా ఉండాలి అని కోరారు. ఇన్‌ఫ్లూయెంజా ఏటా సీజనల్‌గా వ్యాప్తి చెందేదే అయినప్పటికీ ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, ఎక్కువ మంది జనం ఒకే చోట గుమికూడటం వంటి కారణాలతో హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 వంటి కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. -
పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. శ్వాసకోశ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి
సాక్షి, హైదరాబాద్: నగరంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గుముఖం పడుతుండడంతో చలిపులి పంజా విసురుతోంది. మరోవైపు వాహన కాలుష్యం అనూహ్యంగా పెరుగుతుండడంతో సిటీజన్లు శ్వాసకోశ సమస్యలతో సతమతమవుతున్నారు. గత వారంలో పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలకు చేరుకోవడంతో నగరవాసులు గజగజలాడారు. నగరంలో కాలుష్యం,చలి కారణంగా రోగులు, వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ సమస్యలున్నవారు, ప్రయాణికులు, వాహనదారులు, చిరు వ్యాపారులు విలవిల్లాడుతున్నారు. చలి, కాలుష్య తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాహన కాలుష్య ఉద్గారాలు.. గ్రేటర్లో వాహనాలు వదులుతున్న కాలుష్యంతో భూస్థాయి ఓజోన్ మోతాదు క్రమంగా పెరుగుతోంది. దీంతో సిటీజన్లు ఆస్తమా, బ్రాంకైటిస్ తదితర శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలతో పాటు ఓజోన్ వాయువులు సిటీజన్లకు పట్టపగలే చుక్కలు చూపుతున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్ అధికంగా ఉండే ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రధాన రహదారులపై ఓజోన్ వాయువు గాలిలోని నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్లతో కలవడంతో పాటు మంచు, సూర్యరశ్మి ప్రభావంతో భూఉపరితల వాతావరణాన్ని ఓజోన్ దట్టంగా ఆవహిస్తోంది. దీంతో ట్రాఫిక్ రద్దీలో చిక్కుకొన్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులు ఊపిరాడక సతమతమవుతున్నారు. సాధారణంగా ఘనపు మీటరుగాలిలో భూస్థాయి ఓజోన్ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు.. కానీ నగరంలోని ట్రాఫిక్ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 150 మైక్రోగ్రాములుగా నమోదవుతుండడంతో పలు అనర్థాలు తలెత్తుతున్నాయి. వాయు కాలుష్యంతో.. ► పీఎం10, పీఎం 2.5, ఆర్‌ఎస్‌పీఎం సూక్ష్మ, స్థూల ధూళి రేణువులు పీల్చేగాలిలో చేరి నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి. ►దుమ్ము, ధూళి కళ్లలోకి చేరి రెటీనా దెబ్బతింటుంది. ►చిరాకు, అసహనం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు తలనొప్పి, పార్శ్వపు నొప్పి వస్తుంటాయి. ►ధూళి కాలుష్య మోతాదు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల కేన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. పంజా విసురుతున్న చలిపులి.. నగరంలో ఇటీవలికాలంలో కనిష్ట,గరిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతుండడంతో చలిపంజా విసురుతోంది. కిందిస్థాయి గాలుల ప్రభావంతో తరచూ కారుమబ్బులు కమ్ముకుంటుండడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతోంది. ఇటీవల పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల మేర నమోదవడంతో సిటీజన్లు గజగజలాడారు. రాబోయే రోజుల్లో చలితీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. -
కవల పిల్లలని ఎంతో సంబరపడ్డా, కానీ.. నా పిల్లలను ఆదుకోండి.. ప్లీజ్!
ఐదేళ్లుగా పిల్లల కోసం ఎంతగానో పరితపించిన దంపతులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఆస్పత్రులు చుట్టూ తిరిగి మందులు వాడగా.. ఆమె గర్భవతి అయ్యింది. ట్విన్స్ అని తెలిసి ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆరు నెలలకే ఆమె బిడ్డలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే.. మాతృత్వపు మాధుర్యాన్ని తలచుకుంటూ.. తొమ్మిది నెలల భారాన్ని ఆనందంగా అనుభవించి.. బిడ్డకు జన్మనివ్వాలని అనుకున్నాను. కానీ నేను అమ్మ తనం కోసం ఐదేళ్లు ఎదురు చూశా. దేవుడు కరుణించడంతో గర్భం దాల్చాను. అయితే గర్భవతిగా ఉన్న నాకు ఓ రోజు ఉదయం నాకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా.. వైద్య పరీక్షలు చేసి ఉమ్మనీరు తగ్గిందని, వెంటనే డెలివరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పిన విషయాన్ని అన్బుకరసి గుర్తు చేసుకున్నారు. మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి 26 వారాల గర్భిణీ స్త్రీగా ఉన్న నాకు డాక్టర్లు ప్రీ మెచ్యూర్ డెలివరీ చేశారు. ప్రీ మెచ్యూర్ డెలివరీ కారణంగా పుట్టిన కవలలకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో అప్పటి నుంచి వాళ్లిద్దరూ ఎన్ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.పిల్లలు ట్వీట్మెంట్కు సహకరిస్తున్నారని, సురక్షితంగా బయటపడాలంటే మరికొన్ని నెలలు ఎన్‌ఐసీయూలోనే చికిత్స పొందాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. ఖరీదైన వైద్యం కోసం రూ.20 లక్షలు ఖర్చువుతుంది. చాలీ చాలని జీతాలతో బతుకు భారాన్ని మోస్తున్న మేం.. మా పిల్లల్ని రక్షించుకునేందుకు ఇల్లు వాకిలి అమ్ముకున్నాం. బ్యాంకు లోన్ తీసుకొని రూ.8 లక్షల వరకు ఖర్చు చేశాం. ఇప్పటి వరకు చేయాల్సిన వన్నీ చేశాం. మా పిల్లల ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. చికిత్స కోసం తగినంత ఆర్ధిక సాయం చేయండి. మా పిల్లల ప్రాణాల్ని కాపాడండి. (అడ్వర్టోరియల్) మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం
బెంగుళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ బెంగుళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆయన శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడతున్నట్లు వెల్లడించాయి. ఆయన వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆయన శ్వాస సంబంధిత మిషన్ సాయంతో కాస్త హాయిగా శ్వాస తీసుకుంటున్నారని, త్వరితగతిన పూర్తిగా కోలుకుంటారని తెలిపింది. కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ దగ్గరుండి మరీ మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. (చదవండి: ఏడాది వయసు కొడుకుతో ఈ రిక్షా నడుపుతున్న మహిళ: వీడియో వైరల్) -
ఆగిన గుండెకు ఊపిరి పోశారు..
సిరిసిల్ల టౌన్: శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న శిశువుకు 108 సిబ్బంది సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు నిలిపారు. యాదాద్రి జిల్లాకు చెందిన దండుగుల దేవకి మూడో కాన్పు కోసం సిరిసిల్ల లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం చేరి ఆదివారం మగ శిశువుకు జన్మనిచ్చింది. నెలలు నిండకుండా జన్మించిన శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోగా.. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని మాతా శిశు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో శిశువు శ్వాస ఆగిపోయింది. అప్ర మత్తమైన 108 సిబ్బది అనిల్ కుమార్, పెద్ది శ్రీనివాస్ నోటి ద్వారా కృత్రిమశ్వాస అందిం చడంతో బాబు శ్వాస తీసుకోవడం మొదలు పెట్టాడు. ప్రస్తుతం శిశువు మాతాశిశు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాబు ఆరోగ్యపరిస్థితి నిలకడ గా ఉందని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
కరోనాతో ఊపిరి సమస్యలే కాదు.. మరో పెనుముప్పు కూడా!
న్యూఢిల్లీ: కోవిడ్–19.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఈ వైరస్ ప్రధానంగా గురిపెట్టేది ఊపిరితిత్తుల పైనేనని, దీనివల్ల శ్వాస సంబంధ సమస్యలొస్తాయని, ఊపిరాడక మరణాలు సంభవిస్తున్నాయని ఇప్పటిదాకా భావిస్తున్నాం. నిజానికి కరోనా వైరస్ సోకితే కేవలం ఊపిరితిత్తులు దెబ్బతినడమే కాదు, శరీరంలో రక్తం గడ్డకడుతుందని, కొందరిలో ఇది ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవయవాలను కాపాడాలంటే రక్తం గడ్డలను తక్షణమే తొలగించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కరోనా బారినపడి ఆసుపత్రుల్లో చేరిన బాధితుల్లో 14–28 శాతం మందిలో హెచ్చు స్థాయిలో రక్తం గడ్డకట్టినట్లు (డీప్ వీన్ థ్రాంబోసిస్–డీవీటీ), 2–5 శాతం మందిలో స్వల్ప స్థాయిలో (ఆర్టీరియల్ థ్రాంబోసిస్) రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. కరోనాతో ఉపిరితిత్తుల తరహాలోనే రక్త నాళాలు కూడా దెబ్బతింటున్నాయి. ప్రతివారం సగటు ఐదారు కేసులు ఇలాంటివి వస్తున్నాయని ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్‌కు చెందిన ఎండోవాస్క్యులర్ సర్జన్ అంబరీష్ సాత్విక్ చెప్పారు. టైప్–2 డయాబెటీస్‌తో కరోనా బారినపడిన వారిలో ఈ ముప్పు మరింత ఎక్కువ అని ఢిల్లీలోని ఆకాశ్ హెల్త్‌కేర్ వైద్యుడు అమ్రీష్ కుమార్ తెలిపారు. చదవండి: (చైనాకు కలిసొస్తున్న కరోనా..!) (కోవిడ్ సంక్షోభం మన స్వయంకృతం) -
దిలీప్ కుమార్ మృతి
బాలీవుడ్ ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్ అభిమానులను శోకంలో ముంచి వెళ్లిపోయారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1944లో బాంబే టాకీస్ నిర్మాణ సంస్థలో వచ్చిన జ్వర్ భట చిత్రం ద్వారా బాలీవుడ్ తెరకు పరిచయమైన దిలీప్ కుమార్ సుమారు ఆరు దశాబ్దాల పాటు 60 చిత్రాల్లో తన నటనతో అభిమానులను అలరించారు. 1922 లో ప్రస్తుత పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జన్మించిన దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. ఆయన తండ్రి లాలా గులామ్ సర్వార్ పండ్ల వ్యాపారి. తండ్రితో పొసగకపోవటంతో ఇంటి నుంచి వచ్చేసి పూణేకు చేరుకున్న దిలీప్ కుమర్.. అక్కడ ఆర్మీ క్లబ్ వద్ద కొంత కాలం సాండ్విచ్ స్టాల్‌ను నిర్వహిచారు. అనంతరం బాంబేకు చేరుకున్న ఆయన.. 'బాంబే టాకీస్' ఓనర్ దేవికా రాణి సలహా మేరకు తన పేరును యూసుఫ్ ఖాన్ నుంచి దిలిప్ కుమార్‌గా మార్చుకొని జ్వర్ భట(1944) చిత్రంతో బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు. అయితే తొలిచిత్రం దిలిప్ కుమార్‌కు అంతగా గుర్తింపు తీసుకురాకపోయినప్పటికీ అనంతరం నటించిన జుగ్ను(1947) బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి దిలీప్ కుమార్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. అనంతరం షహీద్, మెహబూబ్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన అందాజ్(1949) చిత్రాలతో దిలిప్ కుమార్‌కు ఇండస్ట్రీలో తిరుగులేకుండా పోయింది. అదే ఏడాది రిలీజైన షబ్నం చిత్రం కూడా భారీ హిట్ సాధించడం విశేషం. ఇక 1950 దశకంలో దిలీప్ కుమార్ నటించిన చిత్రాలు.. జోగన్, తరాణా, హల్చల్, దీదర్, దాగ్, దేవ్‌దాస్, యహుది, మధుమతి ఆయనకు ట్రాజెడీ కింగ్ ఇమేజ్ను కట్టబెట్టాయి. దాగ్(1952) చిత్రానికి గాను మొట్టమొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును దిలిప్ కుమార్ పొందారు. ఫుట్‌పాత్, నయా దౌర్, ముసాఫిర్, పైఘం లాంటి పలు సామాజిక నాటక చిత్రాలలో సైతం నటించి దిలీప్ కుమార్ మెప్పించారు. కోహినూర్, మొఘల్ ఏ ఆజమ్ చిత్రాలు దిలిప్ కుమార్‌కు మంచి విజయాన్నిచ్చాయి. గంగా జమునా చిత్రానికి దిలీప్ కుమార్ నిర్మాతగా కూడా వ్యవహరిచారు. దిలీప్ కుమార్ నిర్మాతగా వ్యవహరించిన ఏకైక చిత్రం గంగా జమునానే కావడం విశేషం. దిలిప్ కుమార్ తన కన్నా వయసులో 22 సంవత్సరాలు చిన్నవారైన నటీమణి సైరాభానును 1966లో వివాహమాడారు. అనంతరం 1980లో దిలిప్ కుమార్ సంతానం కోసమని ఆస్మాను వివాహం చేసుకున్నప్పటికీ అది ఎక్కువకాలం నిలువలేదు. 1970 దశకంలో దిలిప్ కుమార్ కెరీర్ గ్రాఫ్ అనూహ్యంగా పడిపోయింది. ఈ కాలంలో ఆయన నటించిన దస్తాన్(1972), బైరాగ్(1976) చిత్రాలు విజయం సాధించలేదు. దిలీప్ కుమార్ అవకాశాలను ఎక్కువగా రాజేష్ ఖన్నా, సంజీవ్ కుమార్‌లు దక్కించుకున్నారన్న వాదన సైతం ఉంది. 1976 నుంచి 1981 వరకు దిలీప్ కుమార్ సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. అనంతరం అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన 'శక్తి' చిత్రానికి గాను దిలీప్ కుమార్ మరోసారి బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. అత్యధికంగా ఎనిమిది సార్లు బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును దిలీప్ కుమార్ పొందారు. ఆయనతో సమానంగా షారుక్ ఖాన్ సైతం 8 ఫిల్మ్ఫేర్లు పొందారు. అత్యధిక అవార్డులు పొందిన నటుడిగా దిలీప్ కుమార్ గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కారు. చిత్రరంగంలో ఆయన అసమాన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మ భూషణ్(1991), పద్మ విభూషణ్(2015) అవార్డులతో సత్కరించింది. 1994లో దాదాసాహెబ్ పాల్కే అవార్డు దిలీప్ కుమార్‌ను వరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1997లో ఎన్టీఆర్ జాతీయ అవార్డుతో ఆయనను సత్కరించింది. దిలిప్ కుమార్ మరణం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. భారత చలనచిత్ర రంగంలో దిలీప్ కుమార్ చేసిన సేవలు మరువలేనివని, ఆయన మరణం తీరని లోటని అన్నారు. భారత్‌లోనే కాదు పాకిస్థాన్‌లో సైతం దిలీప్ కుమార్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.