ఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను గురువారం రాత్రి హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అత్యవసర విభాగంలో మన్మోహన్ సింగ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. ఆయన ఆసుపత్రిలో ఏ అనారోగ్య సమస్య కారణంగా చేరారో తెలియరాలేదు.
అయితే, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్‌లో చేర్చినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా సేవలందించారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో ఆర్బీఐ గవర్నర్ హోదాలో కీలక పాత్ర పోషించిన మన్మోహన్ సింగ్.. 1991 అక్టోబరు 1 నుండి 2019 జూన్ 14 వరకు ఐదు పర్యాయాలు అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా, ఆ తర్వాత ఆయన 2019 ఆగస్టు 20 నుండి 2024 ఏప్రిల్ 3 వరకు రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు.
ఇదీ చదవండి: అప్పటివరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment