పరిసరాలను పట్టించుకుంటున్నారా? | A short note on advantages of a healthy environment | Sakshi
Sakshi News home page

పరిసరాలను పట్టించుకుంటున్నారా?

Published Sat, Jun 29 2024 8:21 AM | Last Updated on Sat, Jun 29 2024 8:21 AM

A short note on advantages of a healthy environment

చాలామంది ఇంటిని, ఒంటిని శుభ్రంగా ఉంచుకుంటారు కానీ మన చుట్టూ ఎలా ఉంటే ఏమవుతుందిలే అన్నట్లు ఉంటారు. అయితే ఇల్లు, ఇంటిలోని మనుషులు మాత్రమే శుభ్రంగా ఉండి పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉంటే ఏం ప్రయోజనం? అనారోగ్యం, అంటువ్యాధులు పో​ంచే ఉంటాయి. ఇంతకీ పరిసరాల పరిశుభ్రత అంటే ఏమిటో, పరిసరాలను ఏవిధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలో చూద్దామా?

ఇంట్లో మురికిగా ఉండే ప్రదేశాలను శుభ్రం చేయడం ఎంత ముఖ్యమో, చుట్టుపక్కల ఉండే హానికారక సూక్ష్మజీవులను నిరోధించడంపై దృష్టిపెట్టడం కూడా అంతేముఖ్యం. చేతులు కడుక్కోవడం, బట్టలు ఉతకడం, ఫ్లోర్‌ని తుడవటం ఆరోగ్యవంతమైన వాతావరణానికి కీలకం. 

ఒక సర్వే మేరకు అపరిశుభ్రమైన పరిసరాలలో మెసలడం వల్ల్ల పిల్లలు ప్రమాదకరమైన అంటురోగాల బారిన పడతారని తెలిసింది. అందువల్ల ఆయా ప్రదేశాలను శుభ్రం చేయడంపై దృష్టి పెట్టాలని, అవి శుభ్రంగా కనిపించినప్పటికీ తగిన శ్రద్ధ పెట్టి ఎలాంటి క్రిములూ లేకుండా చూడాలని, అప్పుడే హానికారక సూక్ష్మ క్రిముల వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

బ్యాక్టీరియా ఎలాపోతుంది?
ఆహారాన్ని తయారు చేసిన తర్వాత నేలను,రాతి దిమ్మెలను శుభ్రం చేయడానికి క్లాత్‌కు బదులు పేపర్‌ టవల్స్‌ వాడి చూడండి. ఇలా చేయడం వల్ల వంటగదిలో ఉపయోగించే గుడ్డలు అపరిశుభ్రం కాకుండా, కలుషితం కాకుండా ఉంటాయి.

ఎలా శుభ్రం చేయాలి? 
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అంటే మురికితో΄ాటు రోగకారక క్రిములను అరికట్టడం. తద్వారా అంటువ్యాధులు సోకకుండా చూసుకోవడం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటురోగాల వ్యాప్తిని తగ్గించొచ్చు. తద్వారా మన పిల్లల్ని రక్షించుకోవడంతో పాటు, ఆసుపత్రులపై ఒత్తిడిని కూడా తగ్గించొచ్చు. ఇంటిని మాత్రమే కాదు, ఇంటి పరిసరాలలో ఎక్కడైనా మురికిగుంటలు, చెత్తకుప్పలు, అపరిశుభ్ర వాతావరణం ఉంటే దానిపై దృష్టి పెట్టాలి. శ్రమ అనో, ఖర్చనో అనుకోకుండా చెత్తను క్లీన్‌ చేయాలి లేదా చేయించాలి. 

కొంతమంది తమ ఇంటిలోని చెత్తనంతటినీ తీసుకొచ్చి ఖాళీగా ఉన్న ప్రదేశాలలో పడేస్తుంటారు. క్రమేణా అవి చెత్తకు, ఆ తర్వాత అపరిశుభ్రతకు, అంటువ్యాధులకు నిలయాలుగా మారతాయి. అందువల్ల చొరవ తీసుకుని క్లీన్‌ చేయించాలి. అలాగే మురికిగుంటలపై కూడా దృష్టి సారించాలి.  పరిసరాలలో నీరు నిలవకుండా చూసుకోవాలి. ఇంటిలోని చెత్తను, తడిచెత్త, పోడిచెత్తగా వేరు చేసి పడెయ్యడం, గాజుపెంకుల వంటి వాటిని విడిగానూ వేరు చేసి పడెయ్యాలి. ఇలాంటి వాటన్నింటినీ బాధ్యతగా చేసినప్పుడే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సూక్ష్మక్రిములు, తద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము.

ఏయే పరిసరాలు?
వంటశాలలు, భోజన శాలలు ∙మరుగుదొడ్లు, ఇల్లు, వంటగదిలో ఉండే మురికి బట్టలు, మసిగుడ్డలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి పెంపుడు జంతువులతో ఉన్నప్పుడు చెత్త, వ్యర్థాలను చేత్తో తాకినప్పుడు, పారేసేటప్పుడు అంటువ్యాధి సోకిన వారికి సపర్యలు చేసేప్పుడు శుభ్రత ΄ాటించడం అత్యవసరం మాంసం వంటి వంటకాలు చేసినప్పుడు వంటగదిలోని నేలను, దిమ్మల్ని, మాంసం కోసిన చెక్క/బోర్డుల్ని శుభ్రం చేయడం చాలా కీలకం. అలాగే, కలుషితమైన ప్రదేశాన్ని, పాత్రల్ని శుభ్రం చేశాక ఆయా గుడ్డలు, స్క్రబ్‌లను, బ్రష్‌లను కడగాలి ఇంట్లో నేలపైన, కుర్చీలు, బల్లల వంటి ఫర్నీచర్‌పైన చాలా దుమ్ము పట్టినట్లు ఉంటుంది. వాటిని కూడా శుభ్రం చేయాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement