కోనసీమ జిల్లా: ఎమ్మెల్యే చిట్టిబాబుకు అస్వస్థత  | P Gannavaram Mla Kondeti Chittibabu Fell Ill | Sakshi
Sakshi News home page

కోనసీమ జిల్లా: ఎమ్మెల్యే చిట్టిబాబుకు అస్వస్థత

Published Fri, Sep 1 2023 7:18 AM | Last Updated on Fri, Sep 1 2023 7:18 AM

P Gannavaram Mla Kondeti Chittibabu Fell Ill - Sakshi

మామిడికుదురు: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి ఎమ్మెల్యే అస్వస్థతకు గురికావడంతో వెంటనే రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆస్పత్రిలో చేర్చారు.

అక్కడ ఎంఆర్‌ఐ స్కాన్‌ చేసిన వైద్యు­లు చిట్టిబాబు మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించారు. వెంటనే అంబులెన్సులో హైద­రాబాద్‌ కిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందో­ళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పి­నట్లు ఎమ్మెల్యే తనయుడు వికాస్‌ తెలిపారు.
చదవండి: బాబు ష్యూరిటీనా.. నమ్మేదెలా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement