
సాక్షి, ములుగు: దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర యాత్రలో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర యాత్రలో పాల్గొన్న సీతక్క నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
అక్కడ తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకొని తహసీల్దార్‌కు మెమోరండం ఇచ్చిన అనంతరం అస్వస్థకు గురయ్యారు. దీంతో కార్యకర్తలు ఆమెను హుటాహుటిన స్థానిక సామాజిక వైద్యశాలకు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఆసుపత్రి సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడంతో ప్రజాప్రతినిధులతో పాటు సీతక్క అభిమానులు, కార్యకర్తలు ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment