![son commits suicide for his father health is not well - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/3/adb.jpg.webp?itok=E11PpxN_)
వాంకిడి: తండ్రి అనారోగ్యంపై మనస్తాపం చెందిన కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై దీకొండ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన ఇటన్‌కార్ వినోద్ (40) తండ్రి మారుతి రెండేళ్ల క్రితం పక్షవాతం బారిన పడి అనారోగ్యానికి గురి అయ్యాడు. అప్పటి నుంచి వినోద్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వైద్యం చేయిస్తూ వచ్చాడు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతూ వచ్చాయే కాని మారుతి ఆరోగ్యం కుదుటపడలేదు. దీనికి తోడు ఈ ఏడాది ఆశించినంతగా పంట దిగుబడి రాలేదు.
కాగా, పత్తి అమ్మిన డబ్బులు సైతం తండ్రి చికిత్సకు ఖర్చయిపోయాయి. అయినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైన వినోద్ తన పత్తి చేనులోనే పురుగుల మందు తాగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని ఎస్సై సందర్శించి పంచనామా నిర్వహించారు. మృతుడి తల్లి నాగుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. వినోద్‌కు భార్య, పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment