
నారా లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. నటుడు నందమూరి తారకరత్న స్పృహ తప్పి పడిపోయారు.
సాక్షి, కుప్పం: నారా లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. నటుడు నందమూరి తారకరత్న స్పృహ తప్పి పడిపోయారు. లక్ష్మిపురం మసీదు వద్ద అదుపు తప్పి వాహనంపై నుంచి కిందకిపడిపోయారు.
తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను చికిత్స కోసం కుప్పం కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న నందమూరి బాలకృష్ణ.. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.