సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరులో అస్వస్థత కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితులు కోలుకుంటున్నారు. ఇప్పటివరకు 556 కేసులు నమోదవ్వగా, 458 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొద్ది గంటలుగా కొత్త కేసులు నమోదు కాలేదు. ప్రస్తుతం 68 మంది బాధితులు చికిత్సపొందుతున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని ఎయిమ్స్ బృందం పేర్కొంది. ఆహారం, బ్లడ్, యూరిన్ శాంపిల్స్ సేకరించామని, మంగళగిరిలో కొన్ని టెస్టులు, ఢిల్లీలో కొన్ని టెస్టులు చేశామని వైద్యులు పేర్కొన్నారు. (చదవండి: ఏలూరు ఘటన: సీఎం జగన్‌తో మాట్లాడిన గవర్నర్)
రిపోర్ట్స్‌ని బట్టి రక్తంలో ఫెస్టిసైడ్‌తో పాటు లెట్ మెటల్స్ గుర్తించామని, పూర్తి రిపోర్ట్స్ రాగానే కారణాలు తెలుస్తాయని వైద్య బృందం పేర్కొంది. కచ్చితంగా ఇన్ఫెక్షన్ అయితే కాదని.. ఇన్ఫెక్షన్ అయితే జ్వరం తగ్గదని, ఫిట్స్ వస్తున్నాయి కాబట్టి.. వేరే సమస్య అయి ఉండొచ్చని వెల్లడించారు. రేపు సాయంత్రానికి కారణం ఏంటనేది కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు. ఢిల్లీ నుంచి మరో బృందం రానుందని.. ఎయిమ్స్ వైద్యుల బృందం తెలిపారు. (చదవండి: ఏలూరు: వైద్య పరీక్షలపై సీఎం జగన్ ఆరా)
Comments
Please login to add a commentAdd a comment