AIMS report
-
కరోనా మృతుల ముక్కు, గొంతులో.. 24 గంటల్లో వైరస్ నిర్వీర్యం
న్యూఢిల్లీ: కరోనా బారినపడి మృతిచెందిన వారిలో వైరస్ ఆనవాళ్లు ఎన్ని రోజులపాటు ఉంటాయన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా వల్ల చనిపోయిన వారిలో వైరస్ కచ్చితంగా సజీవంగా ఉంటుందని, అది మరొకరికి వ్యాపిస్తుందన్న అంచనాతో ప్రత్యేకమైన జాగ్రత్తలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయితే, చనిపోయిన తర్వాత బాధితుల ముక్కు, గొంతులో వైరస్ 12 నుంచి 24 గంటలకు మించి క్రియాశీలకంగా ఉండదని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగం అధినేత డాక్టర్ సుదీర్ గుప్తా మంగళవారం చెప్పారు. మృతుల నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు భారీగా తగ్గిపోతాయని అన్నారు. కరోనా బాధితుల మృతదేహాలపై ఎయిమ్స్‌లోని డిపార్టుమెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్‌లో గత ఏడాదికాలంగా ఒక పైలట్ స్టడీని నిర్వహించారు. దాదాపు 100 మృతదేహాలను పరీక్షించారు. మరణించిన తర్వాత 12 నుంచి 24 గంటల మధ్య కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా, నెగెటివ్ అని తేలింది. అంటే ఆయా మృతదేహాల్లో కరోనా వైరస్ క్రియాశీలతను కోల్పోయింది. పూర్తిగా బలహీనపడింది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా చనిపోతే.. 24 గంటల తర్వాత మృతదేహంలోని ముక్కు, నోటి భాగాల్లో వైరస్ యాక్టివ్‌గా ఉండదని తమ అధ్యయనంలో వెల్లడైనట్లు డాక్టర్ సుధీర్ గుప్తా పేర్కొన్నారు. అయినప్పటికీ కరోనా సంబంధిత మృతదేహాలను దహనం లేదా ఖననం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముక్కు, గొంతులో వైరస్ ఆనవాళ్లు లేకున్నా శరీరం లోపలి నుంచి ప్రమాదకరమైన ద్రవాలు వాటి ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అందుకే కరోనా సంబంధిత మృతదేహాల ముక్కు, గొంతును పూర్తిగా మూసి ఉంచాలన్నారు. అంత్యక్రియలు నిర్వహించేవారు పీపీఈ కిట్లు, మాసు్కలు ధరించాలని తెలిపారు. కరోనా సోకి మృతిచెందిన వారి అంత్యక్రియలు ముగిశాక బూడిద, ఎముకల్లో వైరస్ ఎంతమాత్రం ఉండదని డాక్టర్ సు«దీర్ గుప్తా పేర్కొన్నారు. వాటిని సేకరించడంలో ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. వాటి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు లేవన్నారు. -
ఏలూరు: అస్వస్థత కేసులు తగ్గుముఖం
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరులో అస్వస్థత కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితులు కోలుకుంటున్నారు. ఇప్పటివరకు 556 కేసులు నమోదవ్వగా, 458 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొద్ది గంటలుగా కొత్త కేసులు నమోదు కాలేదు. ప్రస్తుతం 68 మంది బాధితులు చికిత్సపొందుతున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని ఎయిమ్స్ బృందం పేర్కొంది. ఆహారం, బ్లడ్, యూరిన్ శాంపిల్స్ సేకరించామని, మంగళగిరిలో కొన్ని టెస్టులు, ఢిల్లీలో కొన్ని టెస్టులు చేశామని వైద్యులు పేర్కొన్నారు. (చదవండి: ఏలూరు ఘటన: సీఎం జగన్‌తో మాట్లాడిన గవర్నర్) రిపోర్ట్స్‌ని బట్టి రక్తంలో ఫెస్టిసైడ్‌తో పాటు లెట్ మెటల్స్ గుర్తించామని, పూర్తి రిపోర్ట్స్ రాగానే కారణాలు తెలుస్తాయని వైద్య బృందం పేర్కొంది. కచ్చితంగా ఇన్ఫెక్షన్ అయితే కాదని.. ఇన్ఫెక్షన్ అయితే జ్వరం తగ్గదని, ఫిట్స్ వస్తున్నాయి కాబట్టి.. వేరే సమస్య అయి ఉండొచ్చని వెల్లడించారు. రేపు సాయంత్రానికి కారణం ఏంటనేది కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు. ఢిల్లీ నుంచి మరో బృందం రానుందని.. ఎయిమ్స్ వైద్యుల బృందం తెలిపారు. (చదవండి: ఏలూరు: వైద్య పరీక్షలపై సీఎం జగన్ ఆరా) -
ఆరోపణలను ఎయిమ్స్ నివేదిక సమర్థించడం లేదు
తాడ్వాయి ఎన్‌కౌంటర్‌పై పిటిషనర్‌కు స్పష్టం చేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా తాడ్వాయి ఎన్కౌంటర్లో మృతిచెందిన శ్రుతి అలియాస్ మైత్రి, విద్యాసాగర్‌రెడ్డి అలియాస్ సూర్యంను పోలీసులు పట్టుకెళ్లి చిత్రహింసలు పెట్టి చంపారన్న పౌర హక్కుల సంఘం ఆరోపణలను ఎయిమ్స్ ఇచ్చిన నివేదిక సమర్థించడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై శుక్రవారం పూర్తిస్థాయి విచారణ జరుపుతామంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రుతి, విద్యాసాగర్రెడ్డిలది బూటకపు ఎన్కౌంటరని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సివిల్ లిబ ర్టీస్ కమిటీ ప్రధాన కార్యదర్శి చిల్కా చంద్రశేఖర్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. శ్రుతి, విద్యాసాగర్రెడ్డిలకు స్థానిక వైద్యులు నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలను, వీడియో ఫుటేజీని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు పంపి, నివేదికను హైకోర్టు కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎయిమ్స్ వైద్యుల నివేదిక సోమవారం ధర్మాసనానికి అందింది. దీన్ని పరిశీలించిన ధర్మాసనం, పిటిషనర్ ఆరోపణలను సమర్ధించే విధంగా నివేదిక లేదని తేల్చి చెప్పింది. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది రఘునాథ్ స్పందిస్తూ.. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన పోలీసుల గురించి కూడా ఆలోచించాలని వ్యాఖ్యానించింది.