
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో జోరుగా జరుగుతున్న కోడిపందేలపై పోలీసులు దాడులు చేపట్టారు. జిల్లాలోని ఏలూరు డివిజన్, దెందులూరు, ఏలూరు రూరల్ మండలాల్లో శనివారం భారీ ఎత్తున దాడులు నిర్వహించి కోడిపందేల బరులను ధ్వంసం చేశారు. పందేలను నిలువరించేందుకు ఏపీఎస్పీకి చెందిన బెటాలియన్‌ను కేటాయించినట్టు డీఎస్పీ ఈశ్వరరావు తెలిపారు.
ఏలూరు డివిజన్‌లో 500 మందిపై బైండోవర్ కేసులు, 700 మందిపై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. కోడి పందేలను అరికట్టడానికి 67 పికెట్స్.. 10 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. పందేలపై అనుమతి లేదని అనధికారకంగా కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈశ్వరరావు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment