![Tamil Comedian Theepetti Ganesan Dies In Madurai Due To Ill Health - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/22/cme.jpg.webp?itok=WaGwFiKn)
చెన్నై : తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యం కారణంగా కమెడియన్ తేపట్టి గణేశన్(కార్తీ) మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన సోమవారం..మదురైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. బిల్లా-2, ఉస్తాద్ హోటల్, నీరపరై, కన్నే కలైమనే వంటి చిత్రాల్లో నటించిన గణేశన్‌కు గత కొంతకాలంగా అవకాశాలు రాలేదు. దీంతో కుటుంబ పోషణ నిమిత్తం చిన్న చిన్న వ్యాపారాలు చేశాడు. అయితే కరోనా కారణంగా ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో తన పరిస్థితిని వివరిస్తూ సాయం చేయాలని గణేషన్...సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు.
అయితే పేదరికం, సినిమాలు అవకాశాలు లేక గత కొంతకాలం నుంచి గణేషన్..డిప్రెషన్‌లో ఉన్నట్లు సన్నిహిత వర్గాల సమచారం. ఈ నేపథ్యంలో ఆరోగ్యం దెబ్బతిని మదురైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా, గుండెపోటు కారణంగా తుదిశ్వాస వదిలాడు. గణేశన్ మృతిపై పలువురు తమిళ నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చాలా చిన్నవయసులోనే గణేశన్ మృతిచెందడం తమిళ ఇండస్ట్రీకి తీరనిలోటు అని దర్శకుడు శ్రీను రామస్వామి ట్వీట్ చేశారు. ఈ వార్త వినగానే చాలా షాకయ్యానని, తన సినిమాల్లో నటించిన ఉత్తమ నటుల్లో గణేషన్ కూడా ఒకరని రామస్వామి అన్నారు. ఇక గణేషన్ చివరిసారిగా 2019లో రామసామి దర్శకత్వంలో తెరకెక్కిన కన్నే కలైమనే చిత్రంలో నటించారు.
చదవండి : ఆస్పత్రిలో సీనియర్ నటుడు
బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment