
సాక్షి,పశ్చిమగోదావరి: ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తీవ్రత నెమ్మదిస్తోంది. గత 24 గంటల్లో ఐదు కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు మొత్తం 612 నమోదయ్యాయి. ఇక ఈ రోజు ఉదయం నుంచి కొత్త కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఇక ఇప్పటి వరకు 612 మంది అనారోగ్యం పాలవ్వగా 569 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఏలూరు ఆస్పత్రిలో ఏడుగురు బాధితులు.. విజయవాడ, గుంటూరు ఆస్పత్రుల్లో 35 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇక ప్రత్యేక వార్డుల్లోని బాధితులను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. (చదవండి: ఏలూరు ఘటనలో అంతుచిక్కని కారణం)
Comments
Please login to add a commentAdd a comment