
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్‌లో పుడ్ పాయిజన్ కారణంగా జూనియర్ డాక్టర్లు అస్వస్థతకు గురయ్యారు. ఇరవై మూడు మందికి పుడ్ పాయిజన్‌తో వాంతులు, విరోచానాలు కావడంతో అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హాస్టల్‌లో నాసిరకం బోజనం తిని అస్వస్థత గురయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే మెడికోలకు ప్రమాదం లేదని డాక్టర్ చెబుతున్నారు.. జూనియర్ వైద్యులు అస్వస్థతకు గురికావడానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. మెడికోలు చికిత్స పొందుతున్న వార్డును అడిషనల్ కలెక్టర్ డెవిడ్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పుడ్ పాయిజన్ కారణాలు తెలుసుకోవడానికి విద్యార్థులు తిన్న ఆహారాన్ని ల్యాబ్ పంపించామని అన్నారు. నాణ్యత లోపాలు ఉంటే హస్టల్ నిర్వహకుల పై చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment