
విద్యార్థుల అభిప్రాయాలను వీడియోలో చిత్రీకరిస్తున్న దృశ్యం
శ్రీకాళహస్తి రూరల్: ‘జగనన్న గోరుముద్ద’ అమలును మిడ్ డే మీల్స్ (ఎండీఎం)ను పర్యవేక్షించే కేంద్ర బృంద సభ్యులు శనివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం తొండమనాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. 8వ తరగతి గదిలోకి వెళ్లి యోగేష్ అనే విద్యార్థిని మధ్యాహ్నం సమయంలో రోజువారీ మెనూను తెలపాలని కోరారు.
గతంలో ప్రతి పూటా అన్నం, సాంబారు మాత్రమే వేసేవారని, రెండేళ్ల నుంచి జగనన్న గోరుముద్ద పథకం కింద ప్రభుత్వం ప్రతి వారం సోమవారం అన్నం, పప్పుచారు, కోడిగుడ్డు కూర, చిక్కీ, మంగళవారం పులిహోర, టమాటా పప్పు, ఉడికించిన గుడ్డు, బుధవారం వెజిటబుల్ బిర్యానీ, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ, గురువారం కిచిడీ, టమాటా చెట్నీ, ఉడికించిన గుడ్డు, శుక్రవారం అన్నం, ఆకు కూరపప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ, శనివారం అన్నం, సాంబారు, తీపి పొంగల్ అందిస్తున్నారని విద్యార్థి చెప్పాడు. విద్యార్థి చెప్పిన ప్రతి మాటను కేంద్ర బృంద సభ్యులు వీడియోలో చిత్రీకరించారు. అలాగే వంటశాలను, పిల్లలు భోజనం చేస్తుండగా వీడియో తీశారు.
Comments
Please login to add a commentAdd a comment