మెనూ అమలు చేయకపోతే ఏజెన్సీ రద్దు
-
డీఈఓ మువ్వా రామలింగం హెచ్చరిక
చవటపాళెం (వెంకటాచలం): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద మంచి భోజనం పెట్టకుంటే ఏజెన్సీలు రద్దు చేసి కొత్తవారికి ఇస్తామని హెచ్చరించారు. మండలంలోని చవటపాళెం, ప్రాథమి, ప్రాథమికోన్నత, కసుమూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలను శుక్రవారం తనిఖీ చేశారు. చవటపాళెం పాఠశాలలలో ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు రిజిస్టరును పరిశీలించారు. రెండు నెలలకు పైగా ఒక ఉపాధ్యాయురాలు దీర్ఘకాలిక సెలవులో ఉండటం మరొక ఉపాధ్యాయురాలు తరచూ సెలవులు పెట్టడాన్ని అయన గుర్తించారు. ఉపా«ధ్యాయులు దీర్ఘకాలిక సెలవులు, తరచూ సెలవులు పెడుతుంటే విద్యార్థుల భవిష్యత్ ఏమిటని ఎంఈఓ కొండయ్యను ప్రశ్నించారు. సెలవులకు అనుమతి ఎందుకు ఇచ్చారని మండిపడ్డారు. 12 గంటలు దాటినా నిర్వాహకురాలు భోజనం అన్నీ కూరలు తీసుకురాలేదు. భోజనం, ఉల్లగడ్డ కూరను తీసుకురావడంతో ఆయన భోజనం ఎలా ఉందోనని రుచి చూశారు. కూరలో ఉప్పు, కారం, మసాలు తప్ప ఇంకేమీ లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం శుక్రవారం విద్యార్థులకు పెట్టాల్సినదేమిటని నిర్వహకురాలను ప్రశ్నించారు. ఆకుకూర, కోడిగుడ్డు అని చెప్పంది. కోడిగుడ్డు, ఆకుకూరు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఇలాగైతే మిమ్మల్ని తప్పించి ఇతరులకు బాధ్యతలు అప్పజెప్పతామని హెచ్చరించారు. ఇంటి వద్ద కాకుండా పాఠశాలలోనే వంట చేయాలని సూచించారు. పాఠశాలలు తిరిగి భోజనం సక్రమంగా పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఎంఈఓ కొండయ్యను ఆదేశించారు.