DEO Muvva Ramalingam
-
విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి
గూడూరు: ప్రాధమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని డీఈఓ మువ్వా రామలింగం అన్నారు. స్థానిక గ్రీన్‌వ్యాలీ పబ్లిక్ స్కూల్లో గురువారం డివిజన్ పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ప్రాధమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని, రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. దీంతో అందరూ కలిసి సంఖ్యను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రణాళిక సిద్ధ చేసి ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాలన్నారు. పాఠశాలల్లో తరగతుల వారీగా విద్యార్థుల వివరాలు కొన్ని పాఠశాలల్లోని వారు ఆన్లైన్లో ఉంచడం లేదన్నారు. ఇప్పటి వరకూ ఆన్లైన్లో ఉంచని పాఠశాలలు తప్పక ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఏ పాఠశాలకైనా వంట గదులు, అంసపూర్తిగా భవనాలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం పలు విషయాలపై ఆయన ప్రధానోపాధ్యాయులతో చర్చించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ మంజులాక్షి. ఎంఈఓ మధుసూదనరావు, ఇస్మాయిల్ పాల్గొన్నారు. -
19 నుంచి జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలు
ప్రదర్శనలో 525 నమూనాలు డీఈఓ రామలింగం నెల్లూరు (టౌన్): ఈ నెల 19 నుంచి 21 వరకు జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహించనున్నట్లు డీఈఓ మువ్వా రామలింగం తెలిపారు. సుబేదార్‌పేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో బుధవారం అన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలు సెయింట్ జాన్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో జరగనున్నాయని వెల్లడించారు. సైన్స్ ఫెయిర్‌లో మొత్తం 525 నమూనాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలకు వచ్చే ఉపాధ్యాయులు, విద్యార్థులకు భోజన, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి రోజుకు 10 వేల నుంచి 15 వేల మంది విద్యార్థులు సందర్శించే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేసేందకు 18 కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక్కో నమూనాకు రూ.5 వేలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు. ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగ సలహాదారుడు సతీష్‌రెడ్డి హాజరవుతారని వివరించారు. ముగింపు రోజున మంత్రి నారాయణ హాజరవుతారని తెలిపారు. డిప్యూటీ డీఈఓలు షా అహ్మద్, మంజులాక్షి, యస్దానీ అహ్మద్, జిల్లా సైన్స్ అధికారి రాధారాణి, తదితరులు పాల్గొన్నారు. -
హాకీ క్రీడాకారులకు ప్రోత్సాహం కరువు
డీఈఓ మువ్వా రామలింగం వెంకటాచలం : దేశంలో హాకీ క్రీడకు, క్రీడాకారులకు ప్రోత్సాహం కరువైందని జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం అన్నారు. 62వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలు మండలంలోని సరస్వతీనగర్‌లోని అక్షర విద్యాలయంలో శనివారం ప్రారంభమయ్యాయి. డీఈఓ మువ్వా మాట్లాడుతూ హాకీ క్రీడ ద్వారా భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. హాకీ క్రీడను ప్రోత్సహిస్తే వందల మంది క్రీడాకారులను తయారు చేయగల సత్తా వ్యాయామ ఉపాధ్యాయుల్లో ఉందన్నారు. విద్యార్థులు చదువుతోపాటుగా ఆటల్లో కూడా రాణించాలన్నారు. కార్యక్రమంలో వ్యాయమ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి, ఎంఈవో కొండయ్య, జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలు వీరే 62వ స్కూల్ గేమ్స్ హాకీ పోటీలకు రాష్ట్రంలోని 12 జిల్లాల నుంచి బాల, బాలికల జట్లు అక్షర విద్యాలయానికి వచ్చాయి. లీగ్ పద్ధతిలో తొలిరోజు మొత్తం 8 మ్యాచ్‌లు నిర్వహించారు. విజయం సాధించిన జట్లు బాలుర విభాగంలో.. శ్రీకాకుళం జట్టుపై తూర్పుగోదావరి 3–0తో గెలుపొందగా ప్రకాశం జట్టుపై గుంటూరు జట్టు 2–0తో విజయం సాధించింది. కర్నూల్‌పై క్రిష్ణా జిల్లా 3–0తో గెలుపొందగా పశ్చిమ గోదావరి, నెల్లూరు మధ్య జరిగిన పోటీ డ్రాగా మారింది. బాలికల విభాగంలో.. క్రిష్ణా జిల్లా జట్టుపై చిత్తూరు జిల్లా జట్లు 3–0తో గెలుపొందగా, ప్రకాశం జిల్లా జట్లుపై నెల్లూరు జిల్లా జట్లు 3–0తో గెలుపొందింది. అలాగే శ్రీకాకుళంపై విశాఖపట్నం జట్టు విజయం సాధించింది. పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మిగతా లీగ్ మ్యాచ్‌లు పూర్తి చేసి సోమవారం క్వార్టర్స్, సెమీ, ఫైనల్స్ పోటీలు నిర్వహిస్తారు. -
మెనూ అమలు చేయకపోతే ఏజెన్సీ రద్దు
డీఈఓ మువ్వా రామలింగం హెచ్చరిక చవటపాళెం (వెంకటాచలం): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద మంచి భోజనం పెట్టకుంటే ఏజెన్సీలు రద్దు చేసి కొత్తవారికి ఇస్తామని హెచ్చరించారు. మండలంలోని చవటపాళెం, ప్రాథమి, ప్రాథమికోన్నత, కసుమూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలను శుక్రవారం తనిఖీ చేశారు. చవటపాళెం పాఠశాలలలో ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు రిజిస్టరును పరిశీలించారు. రెండు నెలలకు పైగా ఒక ఉపాధ్యాయురాలు దీర్ఘకాలిక సెలవులో ఉండటం మరొక ఉపాధ్యాయురాలు తరచూ సెలవులు పెట్టడాన్ని అయన గుర్తించారు. ఉపా«ధ్యాయులు దీర్ఘకాలిక సెలవులు, తరచూ సెలవులు పెడుతుంటే విద్యార్థుల భవిష్యత్ ఏమిటని ఎంఈఓ కొండయ్యను ప్రశ్నించారు. సెలవులకు అనుమతి ఎందుకు ఇచ్చారని మండిపడ్డారు. 12 గంటలు దాటినా నిర్వాహకురాలు భోజనం అన్నీ కూరలు తీసుకురాలేదు. భోజనం, ఉల్లగడ్డ కూరను తీసుకురావడంతో ఆయన భోజనం ఎలా ఉందోనని రుచి చూశారు. కూరలో ఉప్పు, కారం, మసాలు తప్ప ఇంకేమీ లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం శుక్రవారం విద్యార్థులకు పెట్టాల్సినదేమిటని నిర్వహకురాలను ప్రశ్నించారు. ఆకుకూర, కోడిగుడ్డు అని చెప్పంది. కోడిగుడ్డు, ఆకుకూరు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఇలాగైతే మిమ్మల్ని తప్పించి ఇతరులకు బాధ్యతలు అప్పజెప్పతామని హెచ్చరించారు. ఇంటి వద్ద కాకుండా పాఠశాలలోనే వంట చేయాలని సూచించారు. పాఠశాలలు తిరిగి భోజనం సక్రమంగా పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఎంఈఓ కొండయ్యను ఆదేశించారు. -
విద్యార్థుల కాలాన్ని నష్టపరిచారు
డీఈఓ రామలింగంపై మంత్రి నారాయణ ఆగ్రహం ఫౌండేషన్ కోర్సుల నిర్వహణపై చిత్తూరు, నెల్లూరు జిల్లా అధికారులతో ఫోన్ కాన్ఫరెన్స్ నెల్లూరు, సిటీ: ఫౌండేషన్ కోర్సులను ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తుంటే, మీరు విద్యార్థుల విలువైన కాలాన్ని నష్టపరుస్తున్నారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చిత్తూరు, నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో ఫౌండేషన్ కోర్సులు నిర్వహణ ఏవిధంగా ఉందని మువ్వా రామలింగాన్ని మంత్రి ప్రశ్నించారు. మువ్వా మాట్లాడుతూ 10వ తరగతి మినహాయించి కోర్సులు నిర్వహిస్తామని చెప్పారు. దీంతో మంత్రి నారాయణ మువ్వా పై తీవ్రంగా మండిపడ్డారు. ‘నేను చెప్పింది మీరు చేయాలి, మీ సొంత నిర్ణయాలు వద్దు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేడ్లు ముఖ్యం కాదని, ఫౌండేషన్ కోర్సులు ద్వారా విద్యార్థులకు ఉపయోగం ఉంటుందన్నారు. నీవు డీఈఓగా వచ్చి రెండు నెలలు గడుస్తుంది, ఈ రెండు నెలలు ఫౌండేషన్ కోర్సులు ప్రారంభించకుండా ఉండడంతో విద్యార్థులు విలువైన కాలాన్ని నష్టపోయారన్నారు. అనంతరం చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్దిక్ జెయిన్, నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, చిత్తూరు డీఈఓ నాగేశ్వరరావుతో ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తాను రెండు జిల్లాలకు ఇన్చార్జి మంత్రినని, రెండు జిల్లాల్లో ఫౌండేషన్ కోర్సులు పూర్తి స్థాయిలో నిర్వహించాలన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఫౌండేషన్ కోర్సులు రెండు జిల్లాల్లో ప్రారంభించాలన్నారు. ఈ క్రమంలో చిత్తూరు డీఈఓను ఎంత మంది విద్యార్థులతో కోర్సును మొదలుపెడుతారని మంత్రి ప్రశ్నించారు. చిత్తూరు డీఈఓ మాట్లాడుతూ 3వేల మందితో మొదలుపెడతానని సమాధానం ఇచ్చారు. దీంతో మంత్రి 3వేల మందితో మొదలుపెట్టేందుకు జిల్లా కలెక్టర్, మంత్రి మీతో మాట్లాడాలా అని మండిపడ్డారు. రెండు జిల్లాల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవే విద్యార్థులు 30శాతం మందితో ఈనెల 14వ తేదీ నుంచి ఫౌండేషన్ కోర్సు నిర్వహించాలన్నారు. ఫౌండేషన్ కోర్సుకు అవసరమయ్యే మెటీరియల్ కూడా సరఫరా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. -
మువ్వా హవ్వా!
33 మంది ఎంఈవోలను తప్పించి తన వారిని నియమించుకునే యత్నం తాము పనిచేయలేమని కొందరు ఎంఈవోల నుంచి బలవంతంగా లేఖలు ఆయన మళ్లీ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి గంటాకు ఉపాధ్యాయ సంఘాల ఫిర్యాదు ఆరోపణల్లో నిజం లేదని మువ్వా వివరణ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వివాదాస్పద పరిస్థితుల్లో మరోసారి జిల్లాకు వచ్చిన డీఈవో మువ్వా రామలింగం పనితీరుపై అప్పుడే వివాదాలు ముసురుకుంటున్నాయి. మండల విద్యాశాఖాధికారులను బలవంతంగా తప్పించి ఆ స్థానంలో తన ప్రయోజనాలు తీర్చే వారిని నియమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు మానవవనరులశాఖ మంత్రి గంటాశ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశాయి. వివాదాస్పద పరిస్థితుల్లో బదిలీ జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేసిన మువ్వారామలింగం వివాదాస్పద పరిస్థితుల్లో ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. రాష్ట్ర స్థాయిలో తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని మువ్వా రెండు నెలల కిందట మళ్లీ జిల్లా విద్యాశాఖాధికారిగా వచ్చారు. గతంలో ఆయన వివాదాస్పద పనితీరు వల్ల కొన్ని ఉపాధ్యాయ సంఘాలు రెండోసారి ఆయన రాకను వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో రామలింగం జిల్లా విద్యాశాఖపై తన పట్టు సాధించుకోవడానికి వ్యూహ రచన చేశారు. జిల్లాలో పూర్తి స్థాయి అదనపు బాధ్యతల్లో ఎంఈఓలుగా పనిచేస్తున్న 33 మంది సీనియర్ ప్రధానోపాధ్యాయుల్లో ఎక్కువ మందిని తప్పించి తనకు ఉపయోగపడే వారిని నియమించుకునేందుకు అడుగులు వేస్తున్నారు. తాము ఎంఈఓలుగా పనిచేయలేమని వారి నుంచి బలవంతంగా లేఖలు తీసుకునేలా ఉప విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఉపవిద్యాధికారులు కొందరు ఎంఈఓల నుంచి ఈ తరహా లేఖలు తీసుకుని ఎంఈఓలుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న వారి నుంచి లేఖలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నియామకాల వెనుక పెద్ద వ్యవహారమే నడిచిందనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు డీఈఓ మీద మానవవనరుల శాఖ మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అంగీకారంతోనే మార్పులు చేయాలనుకుంటున్నాం : డీఈఓ మువ్వా రామలింగం జిల్లాలో పనిచేస్తున్న కొందరు మండల విద్యాశాఖాధికారులను వారి అంగీకారంతోనే మార్చాలని యోచిస్తున్నాం. అంతే కానీ ఇందులో ఇతరత్రా ఏమేమో జరిగినట్లు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు. ఏ ఎంఈఓ నుంచి కూడా బలవంతంగా లేఖలు తీసుకోవడం లేదు. -
క్రీడా పోటీలు ప్రారంభం
-
సీసీఈపై అవగాహన కల్పించాలి
నెల్లూరు (టౌన్): నూతనంగా ప్రవేశపెట్టిన సీసీఈ విధానంపై విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని డీఈఓ మువ్వా రామలింగం పేర్కొన్నారు. సరస్వతీనగర్‌లోని మోడరన్ స్కూల్లో ఆదివారం జరిగిన నెల్లూరు జిల్లా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల అసోసియేషన్(నెపస్మా) సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా విద్యాబోధనలో ఆలోచనలను మార్చుకోవాలని సూచించారు. జాతీయ స్థాయిలో విద్యార్థులు పోటీపడేందుకు గానూ సీబీఎస్ఈ సిలబస్ విధానాన్ని ఆదర్శంగా తీసుకొని సీసీఈ విధాన అమలుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫును కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులకు సీసీఈపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. చెముడుగుంటలో ఉన్న సైన్స్ సెంటర్ ద్వారా విద్యార్థులకు పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు యత్నిస్తున్నామని వివరించారు. నెపస్మా నూతన కార్యవర్గ ఏర్పాటు 2018 వరకు నెపస్మా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మైథిలీ మనోహర్‌రెడ్డి, కార్యదర్శిగా వెంకటరామయ్య, కోశాధికారిగా శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్‌రెడ్డి, శ్రీధర్, వాకాటి విజయ్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. పరిశీలకులుగా పోతిరెడ్డి, నేతాజీ సుబ్బారెడ్డి వ్యవహరించారు. -
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(టౌన్) : విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో కూడా రాణించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. బుధవారం నెల్లూరులోని ఎస్–2 థియేటర్ కాంప్లెక్స్‌లో చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెన్నైకు చెందిన చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో ఫెస్టివల్‌ను ఏర్పాటుచేయడం సంతోషకరమని తెలిపారు. నగరంలో ఎస్–1, ఎస్–2, ఎస్–3 థియేటర్లతో పాటు అర్చన, లీలామహల్, కావలిలోని లత థియేటర్, గూడూరులోని సుందరమహల్, శ్రీనివాసతేజ, చదలవాడ వెంకటేశ్వర థియేటర్లులో ఈనెల 24వ తేదీ వరకు బాలల చలన చిత్ర పద్రర్శనలు జరుగుతాయన్నారు. ఇంగ్లిష్ చిత్రం ప్రిన్స్, క్రౌన్ ఆఫ్ స్టోన్, హిందీ చిత్రం ఎహ్ హై చెక్కడ్ బక్కడ్ బొంబాయి బో, తెలుగు చిత్ర అమూల్యం ప్రదర్శిచడం జరుగుతుందన్నారు. వీటి ద్వారా వినోదంతో పాటు విద్యార్థుల ఆలోచనల్లో మార్పుచోటుచేసుకునే అవకాశముందన్నారు. డీఈఓ మువ్వా రామలింగం మాట్లాడుతూ బాలల చిత్రాలు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తాయన్నారు.