విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
మంగళగిరి: విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలను ఆయన సోమవారం సందర్శించారు. గ్రామంలోని నూతన పాఠశాల భవనాన్ని ఆయన పరిశీలించారు. భవన నిర్మాణం విషయంలో కాంట్రాక్టర్ పని తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.