నాణ్యత లేని మద్యాన్న భోజనం | mid day meal is not quality assurance | Sakshi
Sakshi News home page

నాణ్యత లేని మద్యాన్న భోజనం

Published Tue, Mar 14 2017 3:50 PM | Last Updated on Wed, Aug 29 2018 7:54 PM

mid day meal  is not quality assurance

కరీమాబాద్: విద్యార్ధులకు అందించే మద్యాన్న భోజనంలో నాణ్యత లేదని వరంగల్‌ గ్రేటర్‌ కాంగ్రేస్‌ వర్కింగ్‌ అధ్యక్షులు రాజనాల శ్రీహరి అన్నారు. నగరంలోని కరీమాబాద్‌ ప్రభుత్వ ప్రాధమిక, ఉన్నత పాఠశాలలోని మద్యాన్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్ధులకు ఎలాంటి ఆహార పదార్ధాలు పెడుతున్నారో పరీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మద్యాన్న భోజన పతకాన్ని అనుభవంలేని ఏజంట్లకు ఇవ్వడంతో పాటు వారి నుంచి వేరొకరికి చేతులు మారుతుండంతో విద్యార్ధులకు మెనూ ప్రకారం భోజనం అందడం లేదని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గూడూరు మల్లేషం, కోటేశ్వర్‌రావు, వీరాచారి, రఘు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, శివ, రాజేందర్, అమరలింగం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement